ఈ అబ్బాయిలను గుర్తు పట్టారా? వీరు ఇప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ఇద్దరూ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. ఒకరు స్టార్ నటుడి కుమారుడు అయితే.. మరొకరు స్టార్ డైరెక్టర్ కొడుకు. తమ తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇద్దరూ ఇండస్ట్రీలోకి బాలనుటుగా రంగ ప్రవేశం చేశారు. చిన్నతనంలోనే తమ నటనతో ఆకట్టుకున్నారు. ఆపై హీరోలుగా నూ అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు. తమ అద్బుతమైన నటనతో తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లెక్కలేనంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మరి ఈ కుర్రాళ్లెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. వీరు మరెవరో కాదు తమిళ హీరోలు శింబు, అరుణ్ విజయ్. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమారుడే అరుణ విజయ్. తమిళంలో పలు సినిమాల్లో నటించిన అతను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు. ప్రభాస్ నటించిన సాహోలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఇటీవలే వనంగాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ బాల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన టి. రాజేందర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు శింబు. బాలనటుడిగా పలు సినిమాల్లో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ సూపర్ సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో హీరోయిన్లతో రిలేషన్ షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలిచాడీ హ్యాండ్సమ్ హీరో. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కమల్ హాసన్ నటిస్తోన్న థగ్ లైఫ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు శింబు. అలాగే మరొక తమిళ్ చిత్రం (ఎస్‌టీఆర్ 48)లోనూ హీరోగా కనిపించనున్నాడు.త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Nothing has changed in this young man i have known all these years.. always a champ. Kind at heart and a power performer. Keep the happy spirit in u alive always Simbu.There is no looking back from now on in all your future endeavours! Keep riding high brother.. #CCV #STR pic.twitter.com/3a88qYAAXv
— ArunVijay (@arunvijayno1) May 6, 2018
A big thank you to my director @IyakkunarBala Sir for letting me live Koti in #Vanangaan.
It was a once in a lifetime experience getting to play Koti. And to have won hearts all over even without speaking a word, it’s all because of you!
You let me know what I was capable of. And… pic.twitter.com/wko1I1cmbO— ArunVijay (@arunvijayno1) January 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.