Tollywood: ఆమె కళ్లు నటిస్తాయి, మాట్లాడతాయి.. ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి.. 

ఆ హీరోయిన్ కళ్లు నటిస్తాయి.. ఎన్నో భావాలను తెలియజేస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం సహాయ నటిగా మెప్పిస్తుంది. ఇప్పుడ సినిమాల్లో కీలకపాత్రలలో కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: ఆమె కళ్లు నటిస్తాయి, మాట్లాడతాయి.. ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి.. 
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2023 | 8:23 PM

ఆమె కళ్లు మాట్లాడతాయి.. ఎన్నో కబుర్లు చెబుతాయి అని హీరో శర్వానంద్ అన్నట్లు.. ఆ హీరోయిన్ కళ్లు నటిస్తాయి.. ఎన్నో భావాలను తెలియజేస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం సహాయ నటిగా మెప్పిస్తుంది. ఇప్పుడ సినిమాల్లో కీలకపాత్రలలో కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి. తనే టాలీవుడ్ శివగామి.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. దాదాపు 37 ఏళ్లుగా సినీరంగంలో నటిగా కొనసాగుతున్న రమ్యకృష్ణ మొదటి చిత్రం ‘నేరం పూలమండే’. ఈ మూవీతో ఆమె మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దాదాపు 1990 నుంచి 2000 వరకు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించింది.

ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే వెల్లై మనసు సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో బాల మిత్రులు సినిమాతో తెరంగేట్రం చేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ ఇలా స్టార్ హీరోలందరి జోడిగా నటించి మెప్పించింది. ఇప్పుడు సహాయ నటిగా కొనసాగుతున్నారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించారు. చిన్నప్పటి నుంచి భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు.

తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె 12 జూన్ 2003న డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకున్నారు. వీరికి రిత్విక్ అనే కుమారుడు ఉన్నారు. రమ్యకృష్ణ ఇటీవల నటించిన చిత్రం రంగమర్తాండ. ఈ చిత్రానికి డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియాలో అత్యంత బిజీ నటీమణుల్లో ఒకరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.