Tollywood: ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది..

|

Jan 06, 2024 | 10:10 AM

అలాంటి జాబితాలో ఈ హీరోయిన్ కూడా ఉంది. ఒక సినిమాతో ఓవర్ నైట్ స్టా్ర్ అయ్యింది. పైన ఫోటోలో ఉన్న చిన్నారుల్లో టాలీవుడ్ హీరోయిన్ ఉంది. ఎవరో గుర్తుపట్టగలరా ?. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసింది. ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈరోజు ఆ బ్యూటీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది..
Actress
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం కంటెంట్ ఎంపికలో తడబాట్లతో అవకాశాలకు దూరమైనవారు లేకపోలేదు. అలాంటి జాబితాలో ఈ హీరోయిన్ కూడా ఉంది. ఒక సినిమాతో ఓవర్ నైట్ స్టా్ర్ అయ్యింది. పైన ఫోటోలో ఉన్న చిన్నారుల్లో టాలీవుడ్ హీరోయిన్ ఉంది. ఎవరో గుర్తుపట్టగలరా ?. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసింది. ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈరోజు ఆ బ్యూటీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ హెబ్బా పటేల్. 1989 జనవరి 6న ముంబైలో జన్మించింది హెబ్బా. నటిగా సినీరంగ ప్రవేశం చేయకముందు నృత్యకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా.

2014లో తిరుమనం ఎనుం నిఖా సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ కన్నడలో ఆమె నటించిన అధ్యక్ష సినిమా ముందుగా విడుదలైంది. ఆ తర్వాత అదే ఏడాదిలో అలా ఎలా ?.. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి కూడా అంత గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాతి ఏడాది కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో హెబ్బాకు ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత హెబ్బా నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ డిజాస్టర్స్ కావడంతో వెండితెరకు దూరమైంది.

చాలాకాలం వెండితెరకు దూరంగా ఉన్న హెబ్బా.. ఇప్పుడు ఓటీటీలలో దూసుకుపోతుంది. వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఇటు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఆమె నటించిన అలా నిన్ను చేరి, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.