కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్‌కు చైల్డ్‌హుడ్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలోని స్టార్స్ అందరి చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాన్ ఇండియా హీరోయిన్ చిన్ననాటి పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆ హీరోయిన్.. ఇప్పుడు తన ఇన్ స్టాలో చైల్డ్ హుడ్ ఫోటోస్ పంచుకుంది. అందులో ఒక ఫోటోను ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాం. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వయ్యారికి.. ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
అటు వెండి తెరపైనే కాకుండా.. ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తనదైన నటనతో సత్తా చాటుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..? తనే హీరోయిన మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇటీవల హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్త్రీ 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ తో సంచలనం సృష్టించింది. 34 ఏళ్ల తమన్నా బాలీవుడ్ స్టార్ విజయ్ వర్మతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమ విషయాన్ని గతంలోనే వెల్లడించారు. అయితే కొన్ని రోజులుగా తమన్నాను పెళ్లి ఎప్పుడూ ప్రశ్న ఎక్కువగా వేధిస్తుందని తెలిపింది.
అయితే తమన్నాకు పిల్లలంటే భయమని.. అలాగే తాను తల్లిని కావడానికి భయపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తల్లులు తమ సర్వస్వం తమ పిల్లలకు అందిస్తారని.. కానీ తాను పిల్లలకు అంత ప్రేమ, సంరక్షణ, శ్రద్ధ ఇవ్వలేనని చెప్పుకొచ్చింది. పిల్లలు పుట్టాక ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.