Tollywood: నాగార్జున చేతిలోని ఆ బుజ్జాయి ఇప్పుడు ఓ స్టార్.. అందమైన ప్రేమకావ్యాలకు కేరాఫ్ అడ్రస్..
తెలుగు చిత్రపరిశ్రమలో అద్భుతమైన ప్రేమకథలను తీసుకువచ్చారు. లవర్ బాయ్‌గా మెప్పించారు. అలాగే.. అక్కినేని నాగార్జునతో ఓ సూపర్ హిట్ మూవీలో నటించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇక తమ ఫేవరేట్ స్టార్స్ రేర్ పిక్స్ చూసేందుకు.. వారిని గుర్తుపట్టేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే మీకోసం మరో స్టార్ చిన్ననాటి ఫోటోను తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా..అందులో ఓ చిన్న బుజ్జాయిని ఎత్తుకున్న కుర్రాడు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున. గుర్తుపట్టే ఉంటారు కాదా. ఇక కింగ్ చేతిలో ఉన్న ఆ చిన్నారి స్టా్ర్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. సెలబ్రెటీ కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ అందుకున్నారు. తన కెరీర్లో ఎన్నో అందమైన ప్రేమకావ్యాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మీకోసం మరో చిన్న క్లూ.. ఇప్పుడు పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో అద్భుతమైన ప్రేమకథలను తీసుకువచ్చారు. లవర్ బాయ్‌గా మెప్పించారు. అలాగే.. అక్కినేని నాగార్జునతో ఓ సూపర్ హిట్ మూవీలో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన అందమైన ప్రేమకథలో కీలకపాత్రలో నటించారు.ఎవరో గుర్తుపట్టండి.
ఆ బుజ్జాయి మరెవరో కాదండి.. హీరో సుమంత్. అలనాటి సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు మనవడు. అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు. 1999 లో డైరెక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన ప్రేమకథ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన యువకుడు పర్వాలేదు అనిపించుకుంది. ఇక తర్వాత సత్యం , గౌరి సినిమాలు హిట్ అయ్యాయి.గోదావరి, చిన్నోడు, మధుమాసం, పౌరుడు సినిమాలు ప్లస్ అయ్యాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుమంత్.. ఇటీవలే మళ్లీ రావా సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సూపర్ హిట్ అయిన సీతారామం సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
