గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నటీనటుల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈతరం యంగ్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాకుండా..అగ్రకథానాయుకుల చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా. ఆ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు. ఎవరో గుర్తుపట్టండి. తెలుగు రాష్ట్రాల్లో అతనికి భారీగా అభిమానగణం ఉంది. తన కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఆ హీరో సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అతని పేరు చెబితే అభిమానుల్లో పూనకాలు.. అతని సినిమా చూసేందుకు థియేటర్లలో రచ్చే. ఎవరో గుర్తుపట్టండి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఆ స్టార్ ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు పవన్. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం వంట చిత్రాల్లో నటించారు. 1998లో వచ్చి తొలి ప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీతో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తమ్ముడు.. బద్రి, ఖుషి , జానీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో పవన్ స్థానం ప్రత్యేకం.
ఇటీవల భీమ్లానాయక్ సినిమాతో హిట్ అందుకున్న పవన్.. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు పవన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.