అజిత్‌తో ఉన్న ఈ బక్క పల్చని కుర్రాడిని గుర్తుపట్టారా? ది మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ యాక్టర్.. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఫేమస్‌

|

Jun 02, 2023 | 9:24 AM

పై ఫొటోలో స్టార్‌ హీరో అజిత్ కుమార్‌ పక్కన ఉన్న బక్క పల్చని కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? అప్పుడు చూడడానికి ఎంతో సింపుల్‌గా ఉన్న ఆ అబ్బాయి ఇప్పుడు సౌత్‌లోనే ది మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరో. ఏ పాత్రలో నైనా పరకాయ ప్రవేశం చేసే ఈ నటుడికి పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ ఉంది

అజిత్‌తో ఉన్న ఈ బక్క పల్చని కుర్రాడిని గుర్తుపట్టారా? ది మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ యాక్టర్.. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఫేమస్‌
Ajith Kumar
Follow us on

పై ఫొటోలో స్టార్‌ హీరో అజిత్ కుమార్‌ పక్కన ఉన్న బక్క పల్చని కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? అప్పుడు చూడడానికి ఎంతో సింపుల్‌గా ఉన్న ఆ అబ్బాయి ఇప్పుడు సౌత్‌లోనే ది మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరో. ఏ పాత్రలో నైనా పరకాయ ప్రవేశం చేసే ఈ నటుడికి పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ ఉంది. లవ్‌, కామెడీ, యాక్షన్‌.. ఇలా ఏ జోనర్‌కైనా ఇట్టే సరిపోతాడాయన. మొదట ధనుష్‌ వంటి స్టార్‌ హీరోల పక్కన చిన్న చిన్న రోల్స్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సోలో హీరోగా తన ట్యాలెంట్ నిరూపించుకున్నాడు. కేవలం హీరోగానే కాదు విలన్‌గానూ, స్పెషల్‌ రోల్స్‌తోనూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెగ సందడి చేస్తున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. అన్నట్లు తెలుగులోనూ ఈయనకు బోలెడు అభిమానులు ఉన్నారు. రెండేళ్ల క్రితం నేరుగా ఓ తెలుగు సినిమాలో విలన్‌గా చేశారాయన. అప్పటి నుంచి టాలీవుడ్‌లో ఆయనకు క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. యస్‌ అతను మరెవరో కాదు కోలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి.

 

అభిమానులు ముద్దుగా మక్కల్‌ సెల్వన్‌ అని పిల్చుకునే విజయ్‌ సేతుపతి ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన మైఖెల్, విడుదల సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. విజయ్‌ నటించిన తాజా చిత్రం ముంబైకర్‌ ఈరోజు (జూన్‌2) నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక విజయ్‌ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. షారుఖ్‌ కాన్‌ జవాన్‌, విడుదల 2, మేరీ క్రిస్మస్‌, గాంధీ టాక్స్ వంటి సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు విజయ్‌.

ఇవి కూడా చదవండి

 

 

Ajith, Vijay Sethupathi

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..