
పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు వెండితెర అందగాడు. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరో. బుల్లితెరపై చిన్న చిన్న పాత్రలు చేసిన ఆ అబ్బాయి… తమిళం, తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాలు ఇప్పిటకీ ఎవర్ గ్రీన్ హిట్. ఎవరో గుర్తుపట్టండి. దాదాపు 7 భాషల్లో అనేక సినిమాలు చేసిన అతి తక్కువ భారతీయ నటుల్లో ఆయన ఒకరు. ఈరోజు ఈ స్టార్ హీరో బర్త్ డే. 52 ఏళ్ల వయసులోనూ హీరోగా రాణిస్తున్నారు. గుర్తుపట్టగలరా ? తనే హీరో రంగనాథన్ మాధవన్… అలియాస్ ఆర్.మాధవన్. 1970లో జూన్ 1న బీహార్లోని జంషెడ్ పూర్ లో తమిళ కుటుంబంలో జన్మించారు.
1996లో సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన శాండల్ వుడ్ టాల్క్ ప్రకటనలో నటించాడు మాధవన్. ఆ తర్వాత 1997లో డైరెక్టర్ మణిరత్నం ఇరువర్ చిత్రంలో ఓ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్ లో పాల్గొన్నాడు. కానీ అతని కళ్లు చాలా చిన్నవిగా ఉన్నాయని.. మాధవన్ ను రిజెక్ట్ చేశారు మణిరత్నం. ఆ తర్వాత ధన్ అలైపాయుతే సినిమాతో మాధవన్‌ని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు మణిరత్నం.అలైపాయుతే చూసిన అభిమానులంతా మాధవన్ చిరునవ్వుకు ముగ్దులయ్యారు.
అప్పటివరకు అరవింద్ స్వామి లాంటి హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కానీ మాధవన్ ఎంట్రీ తర్వాత అతడికి మరింత క్రేజ్ వచ్చే్సింది. మణిరత్నం అభిమాన నటుల్లో మాధవన్ ఒకరు. ఆయుధ కేశో చిత్రంలో మణిరత్నం మాధవన్‌ను విలన్‌గా చూపించారు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. మాధవన్ చివరగా కనిపించిన చిత్రం రాకెట్రీ. ఈ సినిమాకు ఆయన స్వయంగా దర్శకత్వం వహించారు. సినీ ప్రియుల నుంచి ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా..మాధవన్ నటన, దర్శకత్వంపై ప్రశంసలు కురిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.