Guess The Actor: బబ్లీగా కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టగలరా..? స్టార్ హీరో ఈ కుర్రాడికి మేనమామ..

స్టార్ హీరో ఈ కుర్రాడికి మేనమామ. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ కుమారుడు ఈ కుర్రాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నాడు. ఇంతకీ ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఈరోజు ఆ స్టార్ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Guess The Actor: బబ్లీగా కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టగలరా..? స్టార్ హీరో ఈ కుర్రాడికి మేనమామ..
Actor

Updated on: May 30, 2024 | 10:06 AM

పైన ఫోటోలో బబ్లీగా కనిపిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టగలరా..? తెలుగు సినీ పరిశ్రమలో ఫేమస్ సెలబ్రెటీ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి. స్టార్ హీరో ఈ కుర్రాడికి మేనమామ. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ కుమారుడు ఈ కుర్రాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నాడు. ఇంతకీ ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఈరోజు ఆ స్టార్ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆ హీరో చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఆ కుర్రాడు మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్.

అల్లు శిరీష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడిగా సినీ పరిశ్రమలోకి హీరోగా తెరంగేట్రం చేశాడు అల్లు శిరీష్. 2013లో గౌరవం సినిమాతో అరంగేట్రం చేశాడు. తొలి సినిమా డిజాస్టర్ కావడంతో శిరీష్ కు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కొత్త జంట సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో వంటి చిత్రాల్లో నటించాడు.

ప్రస్తుతం శిరీష్ బడ్డీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేశ్ కుమార్, మహ్మద్ అలీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అల్లు శిరీష్ చివరగా ఊర్వశివో రాక్షసివో సినిమాలో కనిపించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.