Tollywood: క్యూట్‏గా ఉన్న ఈ చిన్నారి టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మాత్రం.. అందుకు విభిన్నం. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ కొట్టేసింది. దీంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఇప్పుడు గోల్డేన్ బ్యూటీ అయింది. ఎవరో గుర్తుపట్టగలరా ?..

Tollywood: క్యూట్‏గా ఉన్న ఈ చిన్నారి టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress

Updated on: Jun 20, 2023 | 7:33 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ జోరు కొనసాగుతుంది. తమిళ్, మలయాళం, కన్నడ చిత్రపరిశ్రమలోని యంగ్ హీరోయిన్స్.. ఇప్పుడు తెలుగు తెరపై సందడి చేస్తున్నారు. అందులో కొందరు మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకోగా.. మరికొందరు డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇక మరికొందరు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మాత్రం.. అందుకు విభిన్నం. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ కొట్టేసింది. దీంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఇప్పుడు గోల్డేన్ బ్యూటీ అయింది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. తనే హీరోయిన్ సంయుక్త మీనన్.

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో రానా భార్య పాత్రలో నటించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇక ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో నటించి మరో హిట్ అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత సార్, విరూపాక్ష చిత్రాలతో మరిన్ని విజయాలను అందుకున్న సంయుక్త.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన డేవిల్ చిత్రంలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులోనూ ఈ బ్యూటీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయాలను ప్రకటించనున్నారట. ఇక సోషల్ మీడియాలో సంయుక్త ఫుల్ యాక్టివ్. తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.