టాలీవుడ్ లో తక్కువ టైం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు మారుతి. కామెడీనే ప్రధానాంశంగా మారుతి సినిమాలను తెరకెక్కిస్తూ అందుకుంటున్నాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రీసెంట్ గా మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి ప్రతి రోజు పండగే అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మ్యాచో హీరో గోపీచంద్ తో కలిసి సినిమా చేస్తున్నాడు మారుతి. పక్క కమర్షియల్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సీటీమార్ అనే టైటిల్ తో తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది.
తాజాగా హీరో గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో మాంఛి జోష్ తో స్టెప్పులు వేస్తూ, మరింత హ్యాండ్సమ్ గా గోపీచంద్ కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జిల్’ విజయాన్ని అందుకుంది. అలాగే మారుతీ దర్శకత్వంలో రాశి ఖన్నా చేసిన ‘ ప్రతి రోజూ పండగే’ సినిమా కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమాకూడా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
Wishing Maa Macho Hero @YoursGopichand a wonderful birthday in advance
Presenting him in a new way ofcourse in a #PakkaCommercial way
Happy to work with you. Long way to go#HBDGopiChand ??❤️?@GeethaArts @UV_Creations @RaashiiKhanna_ @JxBe#AlluAravind #BunnyVas @SKNonline pic.twitter.com/jhTu4npZfP
— Director Maruthi (@DirectorMaruthi) June 11, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :