BiggBoss 9: విన్నర్ అతనే.. గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది.. రన్నర్ ఎవరంటే

బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

BiggBoss 9: విన్నర్ అతనే.. గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది.. రన్నర్ ఎవరంటే
Bigg Boss 9

Updated on: Dec 12, 2025 | 8:29 AM

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిపోనుంది. ఇక ఫినాలే దగ్గరపడటంతో విన్నర్ ఎవరు అవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం హౌస్ లో కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి , డీమన్ పవన్ ఉన్నారు. ఈ ఏడుగురిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు.? ఎవరు విన్నర్ అవుతారు .? ఎవరు రన్నర్ అవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్ గా కళ్యాణ్ పడాల నిలిచాడు. ప్రస్తుతం సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ మొదలైన దగ్గర నుంచి సీరియల్ బ్యూటీ తనూజ విన్నర్ అవుతుందని ప్రేక్షకులు ఊహించారు.

బిగ్ బాస్ కూడా ఆమెకు సపోర్ట్ గా నిలుస్తూ వచ్చాడు. దాంతో తనుజను బిగ్ బాస్ ముద్దుబిడ్డగా ప్రేక్షకులు పిలుచుకున్నారు. ఆమె ఎం చేసిన వెనకేసుకు రావడం.. సంచలక్ గా తప్పు చేసినా కూడా పెద్దగా మందలించకపోవడంతో ప్రేక్షకులు కూడా ఆమె బిగ్ బాస్ 9 విన్నర్ అవుతుందని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా రేస్ లోకి కళ్యాణ్ వచ్చాడు. టాస్క్ ల్లో సత్తా చూపిస్తున్నాడు కళ్యాణ్. అలాగే ఆట పరంగానూ కళ్యాణ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు.

దాంతో ఇప్పుడు కళ్యణ్ విన్నర్ అవుతాడు అంటూ ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలా ఉంటే కళ్యాణ్ విన్నర్ అని ప్రేక్షకులే కాదు గూగుల్ కూడా ఫిక్స్ అయ్యినట్టుంది. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు.? అని గూగుల్ ఏఐని అడిగితే.. కళ్యాణ్ పడాల విన్నర్ అని చెప్పేసింది. దాంతో కళ్యాణ్ విన్నర్ అవ్వడం ఖాయం అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇక  రన్నర్ ఎవరు అని అడిగ్గా.. తనూజ పుట్టస్వామి అని చెప్తుంది గూగుల్. మరి ఏఐ చెప్పింది నిజమో కాదు మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. చూడాలి ఏం జరిగుతుందో..

Bigg Boss9

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.