Satyadev Timmarusu: సత్యదేవ్ బర్త్ డే కానుక.. ఆకట్టుకుంటున్న తిమ్మరుసు మూవీ గ్లిమ్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ ఆతర్వాత హీరోగా మరిన నటుడు సత్యదేవ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో.

Satyadev Timmarusu: సత్యదేవ్ బర్త్ డే కానుక.. ఆకట్టుకుంటున్న తిమ్మరుసు మూవీ గ్లిమ్స్
Satyadev

Updated on: Jul 04, 2021 | 3:42 PM

Satyadev’s Timmarusu: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ ఆతర్వాత హీరోగా మరిన నటుడు సత్యదేవ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తిమ్మరుసు అనే సినిమా చేస్తున్నాడు. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్లపై మహేశ్‌ కోనేరు, సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం శేఖర్‌ చంద్ర అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ పుట్టిన రోజు కానుకగా నేడు తిమ్మరుసు సినిమా నుంచి గ్లిమ్స్ ను విడుదల చేశారు.

“తెలివికి మూర్ఖత్వానికి మధ్య సన్నని గీత ఉంటుంది..ఆ గీతకు ఇటు వైపు ఉన్నవాడు తెలివైనవాడు అవుతాడు. అటు వైపు ఉన్నవాడు మూర్ఖుడు అవుతాడు. అనే డైలాగ్ తో ఈ వీడియో మొదలవుతుంది. దానికి సత్య దేవ్ స్పందిస్తూ.. నేను చదివిని లా ప్రకారం గీతకటువైపు జరిగిన అన్యాయం ఉంది. ఇటువైపు చేయాల్సిన న్యాయం ఉంది” అని అంటాడు.  ఇక డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుందని వీడియో చూస్తే అర్ధమవుతుంది అన్నారు. ఇక ఈ సినిమాలతో పాటు సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Varun Tej and Naga Chaitanya: అక్కినేని-మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల మల్టీస్టారర్.?

Megastar Chiranjeevi: చిరుకి చెల్లెలుగా ఆ స్టార్ హీరో సతీమణి.. గట్టిగా వినిపిస్తున్న గుసగుస..

David Warner: ‘వినయ విధేయ వార్నర్‌’.. ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్‌. వైరల్‌గా మారిన వీడియో..