AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game On: సమ్మర్‌లో సందడి చేయడానికి రెడీ అవుతోన్న ‘గేమ్‌ఆన్‌’.. సరికొత్త కథతో రానున్న సినిమా

కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం  విశేషం.  మధు బాల, ఆదిత్య మీనన్‌ కీలక పాత్ర నటిస్తున్నారు.

Game On: సమ్మర్‌లో సందడి చేయడానికి రెడీ అవుతోన్న ‘గేమ్‌ఆన్‌’.. సరికొత్త కథతో రానున్న సినిమా
Game On
Rajeev Rayala
|

Updated on: Apr 12, 2023 | 5:44 PM

Share

ఇటీవల టాలీవుడ్ లో వస్తోన్న సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్న సినిమాలైనా కథ బాగుంటే భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ఇంట్రెస్టింగ్ కథతో సినిమా రానుంది. గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం  విశేషం.  మధు బాల, ఆదిత్య మీనన్‌ కీలక పాత్ర నటిస్తున్నారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి రియల్‌ టైమ్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు. అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్‌ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో ఆధ్యంతం ఉత్కంఠగా సాగే  కోర్‌ డ్రామా ఇది. సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ ‘‘రథం చిత్రం తర్వాత గీతానంద్‌ని మరోస్థాయిలో నిలబెట్టే చిత్రమిది. గీతానంద్‌, దయానంద్‌ ఇద్దరిలో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం గొప్ప స్టార్‌క్యాస్ట్‌ తీసుకున్నాం. కీలక పాత్ర పోషించిన మధుబాల గతంలో ఉన్నడూ చేయని పాత్ర ఈ చిత్రంలో చేశారు. న్యూఏజ్‌ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది. మధుబాల పాత్రకు కుటుంబ ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్‌ అవుతారు. కార్తికేయ 2తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్‌ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. నేహా సోలంకి నటనతోపాటు అందచందాలతో కూడా ఆకట్టుకుంటారు అని చెప్పుకొచ్చారు రవి.అలాగే శుభలేఖ సుధాకర్‌, కిరీటి, వాసంతి, కీలక పాత్రలో అలరిస్తారు.

ఇక ఇటీవల విశ్వక్‌సేన్‌ విడుదల చేసిన టీజర్‌, అంతకుముందు వదిలిన పాటలకు స్పందన బావుంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ నవాబ్‌  గ్యాంగ్‌ అందించిన సంగీతం సినిమాకు ఎసెట్‌ అవుతుంది. అనురాగ్‌ కులకర్ణి, హారిక నారాయణ్‌ పాడిన రెండో పాట ‘పడిపోతున్నా’ 2 రోజుల్లో 2 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. ఆ స్పందనతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. అరవింద్‌ విశ్వనాథన్‌ అద్భుతంగా విజువల్స్‌ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌ మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. అలాగే ఈ సినిమాకు మేము చేేస ప్రతి ప్రమోషన్‌ కూడా వినూత్నమైన రీతిలో ఉంటుంది. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని అన్నారు. అలాగే దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ‘‘తెలుగులో ఇప్పుడు డిఫరెంట్‌ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్‌ కూడా అవుతున్నాయి. ఓ మార్క్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఆ కోవలోనే గేమ్‌ ఆన్‌ సినిమా ఉంటుంది. ట్విస్టులు, టర్నులతో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది. ఈ సినిమాలో యాక్షన్‌, రొమాన్స్‌. ఎమోషన్స్‌… అన్ని రకాల ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!