
తెలుగు సినిమా ప్రపంచంలో తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన సహయ నటీనటులు చాలా మంది ఉన్నారు. చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి.. తమ నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది గీతా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటి. ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా అల్లరి నరేశ్ జోడిగా నటించిన కితకితలు సినిమాతో ఎక్కువగా ఫేమస్ అయ్యింది. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. కితకితలు మూవీ ఆమె కెరీర్ మలుపు తిప్పింది. అయితే వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే పలు కారణాలతో సినిమాలకు దూరమైపోయింది. ఇటీవలే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
గీతా సింగ్ మాట్లాడుతూ.. “నా ఫస్ట్ మూవీ తేజ గారితో చేశాను. అదే జై సినిమా. ఆడిషన్ కు వెళ్తే సెలక్ట్ చేసుకున్నారు. అప్పుడు కాలేజీ చదువుతున్నాను. తేజ గారంటే కొడతార అని అప్పట్లో అందరికి భయం. సినిమాలో ఒక సీన్ లో నేను వేరే నటుడి చెయ్యి కొరకాలి. ఆ సీన్ లో నిజంగా కొరికేశాను. దీంతో అందరూ నవ్వేశారు. చెప్పకుండానే నవ్వుతూనే ఉన్నారు నా యాక్టింగ్ కు.. దీంతో ఈవీవీ సత్యనారాయ
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..
ఇక కితకితలు సినిమాకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు అనుకున్నాను. కానీ ఆ సినిమా చాలా పెద్ద హిట్టయ్యింది. బడ్జెట్ కేవలం రూ.60 లక్షలు మాత్రమే. కానీ బాక్సాఫీస్ వద్ద ఎక్కువగానే కలెక్షన్స్ వచ్చాయి. సినిమా అయ్యాక నన్ను పిలిచి డైరెక్టర్ రెండున్నర లక్షలు ఇచ్చారు. వద్దన్నాను అయినా నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న గీతా సింగ్.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో అలరించేందుకు రెడీ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..