పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడిని.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆ హీరోనే..

గబ్బర్ సింగ్ సాయిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు సాయి, తమ నటనా ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లను, పరిశ్రమలోని అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్‌గా దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించినా, ఆశించిన గుర్తింపు, అవకాశాలు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడిని.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆ హీరోనే..
Gabbar Singh Sai

Updated on: Jul 10, 2026 | 4:30 PM

తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా తనదైన ముద్ర వేసుకున్నాడు సాయి. కేవలం సాయి అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ  “గబ్బర్ సింగ్ సాయి” అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలు, చిత్ర పరిశ్రమలోని అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సుమారు 250 చిత్రాలలో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు, గుర్తింపు లభించడం లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు సాయి. పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” సినిమాలో “అంత్యాక్షరి” సీన్ తన కెరీర్‌కు ఒక మలుపు అని, ఆ సినిమా తర్వాతే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ, ఆయన సెట్‌లో అందరినీ గుర్తుంచుకుంటారని, అద్భుతమైన వ్యక్తిత్వం కలవారని ప్రశంసించారు. సుమారు 9-10 సినిమాలలో పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేశానని తెలిపారు సాయి.

ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

తన కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం పడిన కష్టాలు, పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం, మూడో తరగతి ఫెయిలవ్వడం వంటి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. రూ 100 పెట్రోల్ కోసం కూడా కష్టపడిన రోజుల నుంచి ఈ స్థాయికి చేరుకోవడం దైవ దయ, దర్శకుల ప్రోత్సాహం వల్లేనని చెప్పారు. మోహన్ బాబు గారే తనను పరిశ్రమకు పరిచయం చేశారని, ఆయన బ్యానర్‌లో నటులకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. రాజమౌళి, శ్రీను వైట్ల, హరీష్ శంకర్ వంటి దర్శకులు కూడా తనకు అవకాశాలు ఇచ్చారని తెలిపారు సాయి.

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..

క్యారెక్టర్ ఆర్టిస్టులకు, ముఖ్యంగా చిన్న నటులకు పేమెంట్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని సాయి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానగర్‌లో ఎంతోమంది ప్రతిభావంతులైన నటులు సరైన అవకాశాలు లేక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని దర్శకులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు సాయి. తమిళనాడులో స్థానిక నటులకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగు పరిశ్రమలో లేదని, ముంబై నుంచి నటులను తెస్తున్నారని, స్థానిక తెలుగు నటులకు అవకాశాలు ఇవ్వాలని ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా విన్నవించుకున్నామని చెప్పారు  సాయి. అలాగే కామెడీ చేయడం విలన్ పాత్రల కంటే కష్టమని, తాను సుమారు 200 సినిమాలలో విలన్‌గానే నటించానని సాయి వెల్లడించారు. కామెడీ పాత్రల కోసం, కొత్త అవకాశాల కోసం 120 కిలోల నుంచి 98 కిలోలకు బరువు తగ్గించుకున్నానని తెలిపారు. న్యూజిలాండ్‌లో మోహన్ బాబు నిర్మాణంలో కన్నప్ప షూటింగ్ సమయంలో ఆహార ఇబ్బందుల కారణంగా బరువు తగ్గానని, అయితే బరువైన శరీరతత్వం ఉన్నప్పుడే అవకాశాలు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. బరువు తగ్గడం వల్ల కొన్ని విలన్ పాత్రలు చేజారినా, కామెడీ వైపు దృష్టి సారించడానికి ఇది ప్రయోజనకరంగా మారిందని వివరించారు. అదేవిదంగా సాయి మాట్లడుతూ.. తన కూతురి పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తారని ఆశించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశానని, కేవలం ఆయన కోసమే ఆరు లారీల పూలతో ఘన స్వాగతం పలకాలని ప్లాన్ చేసినప్పటికీ.. పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లడం వల్ల రాలేకపోయారని, ఆయన బదులుగా నాగబాబు గారు వచ్చి ఆశీర్వదించారని తెలిపాడు సాయి. ప్రస్తుతం దర్శకుడు బాబీ గారి సినిమాతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు చేస్తున్నానని, ఒక చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆర్ఎక్స్ 100 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నుంచి రావు బహదూర్ వరకు.. అదరగొడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us