అల్లు అర్జున్‌కి వార్నింగ్‌ ఇచ్చిన.. మాజీ ఏసీపీ విష్ణుమూర్తి మృతి! ఏం జరిగిందంటే

సంధ్యా ధియేటర్‌ ఘటనలో వార్తల్లో నిలిచిన మాజీ ఏసీపీ విష్ణుమూర్తి హఠన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు పోలీస్‌ శాఖ వెల్లడించింది. ఆదివారం రాత్రి (అక్టోబర్‌ 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై..

అల్లు అర్జున్‌కి వార్నింగ్‌ ఇచ్చిన.. మాజీ ఏసీపీ విష్ణుమూర్తి మృతి! ఏం జరిగిందంటే
Former ACP Vishnu Murthy death

Updated on: Oct 07, 2025 | 9:16 AM

హైదరాబాద్‌, అక్టోబర్ 7: హైదరాబాద్‌ సంధ్యా ధియేటర్‌ ఘటనలో వార్తల్లో నిలిచిన మాజీ ఏసీపీ విష్ణుమూర్తి హఠన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు పోలీస్‌ శాఖ వెల్లడించింది. ఆదివారం రాత్రి (అక్టోబర్‌ 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌కు వార్నింగ్‌ ఇవ్వడంతో విష్ణుమూర్తి పేరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విష్ణుమూర్తి మృతి పట్ల పలువురు అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా విడుదల సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ను సందర్శించారు. అయితే తమ అభిమాన నటుడిని చూడాలని అభిమానులు ఎగబడటంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అవినీతి ఆరోపణలపై అక్టోబర్ 2024లో సస్పెండ్ అయిన విష్ణు మూర్తి విలేకరుల సమావేశం నిర్వహించి అల్లు అర్జున్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అల్లు అర్జున్‌కి చట్టంపై ప్రాథమిక అవగాహన లేదని ఆయన ఆరోపించారు ఈ విలేకరుల సమావేశంలో ఆయన చిత్ర పరిశ్రమపై పలు విమర్శలు చేశారు.

అయితే అనుమతి లేకుండా విలేకరుల సమావేశం నిర్వహించినందుకు అధికారులు అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అనుమతి లేకుండా ప్రెస్‌మీట్‌ పెట్టడం క్రమశిక్షణా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, విష్ణు మూర్తిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కి నివేదికను పంపుతున్నాము. డీసీపీ కార్యాలయం ఈ విషయంపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) అక్షాంష్ యాదవ్ ప్రకటించారు. ఇటువంటి చర్యలను సహించబోమని, ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించే వారిపై అవసరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డీసీపీ అప్పట్లో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. ఇక తొక్కిసలాట సంఘటన తర్వాత అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు కూడా. అయితే ఒక రోజు తర్వాత బెయిల్ మంజూరు కావడంతో అల్లు అర్జున్ విడుదలైన బయటకు వచ్చారు. ఇక పుష్ప 2 మువీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద కనక వర్గం కురిపించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.