Bro Movie: ‘బ్రో’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. మై డియర్ మార్కండేయ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

పవన్ తో కలిసి ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సైతం నటిస్తోన్న సినిమా బ్రో. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా మ్యూజిక్ సందడి షూరు కాలేదు. ఇక ఇప్పుడు ఆ కొరత తీరనుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈరోజు (జూలై 8) సాయంత్రం విడుదల కానుంది.

Bro Movie: బ్రో నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. మై డియర్ మార్కండేయ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..
Bro Song

Updated on: Jul 08, 2023 | 8:14 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. రాజకీయాలు.. సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇప్పటికే బ్రో షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్.. మరికొన్ని రోజుల్లోనే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయనున్నారు. ఇప్పుడు వపన్ నటిస్తోన్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ తో కలిసి ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సైతం నటిస్తోన్న సినిమా బ్రో. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా మ్యూజిక్ సందడి షూరు కాలేదు. ఇక ఇప్పుడు ఆ కొరత తీరనుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈరోజు (జూలై 8) సాయంత్రం విడుదల కానుంది.

ఈ చిత్రం నుంచి మై డియర్ మార్కండేయ అంటూ సాగే సాంగ్ శనివారం సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. ఇటీవల పవన్ మ్యూజిక్ ప్లే చేస్తోన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు తమన్. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

తమిళంలో సూపర్ హిట్ అయిన వినొదయ చిత్తం సినిమాకు రీమేక్‏గా బ్రో మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నారు పవన్. అంతేకాకుండా.. ఈ మూవీలో మామ, మేనల్లుడు కామెడీతో అలరించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలో సాయి తేజ్ పేరు మార్కండేయ కాగా.. పవన్ పేరు కాలుడు అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.