కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా కేజీఎఫ్ 2 (KGF 2). గతంలో సెన్సెషన్ సృష్టించిన కేజీఎఫ్ చిత్రానికి సిక్వె్ల్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యశ్. ఈ మూవీలో యశ్ నటనకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో కేజీఎఫ్ సిక్వెల్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలను నెలకోల్పాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ సైతం షూరు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు సినీ క్రిటిక్ ఉమైర్ సంధు.
యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న కేజీఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదని.. వరల్డ్ క్లాస్ మూవీ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇందులో యశ్‌తోపాటు.. మిగతా నటీనటుల నటన అద్భుతమని… టెరిఫిక్ అంటూ తెగ పొగిడేశాడు. అంతేకాకుండా.. కన్నడ ఇండస్ట్రీకే కేజీఎఫ్ 2 మూవీ కిరీటంలాంటిందని.. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతిసన్నివేశం అదిరిపోయిందంటూ కితాబు ఇచ్చేశాడు. యాక్షన్స్ సీన్స్.. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్ అని.. డైలాగ్స్, మ్యూజిక్.. బీజీఎం అదిరిపోయిందని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్బుతంగా తెరకెక్కించాడని కొనియాడరు. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ షాకిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. భారీ క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
BREAKING NEWS : First Detail Review of #KGFChapter2 from Overseas Censor Board on my Instagram Story. ” #KGF2 is Crown of Indian Cinema “. ⭐⭐⭐⭐⭐. Link : https://t.co/Jwpgj1KJ8T pic.twitter.com/GuQsKADO0w
— Umair Sandhu (@UmairSandu) April 9, 2022
Also Read: NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..
Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..