‘తాగేసి షూటింగ్‌కి వచ్చానని.. ఎన్టీఆర్ మా ఫైటర్స్‌ను పిలిచి ఏం చేశాడంటే..’

ఫైటర్ రామకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌తో జరిగిన అనూహ్య సంఘటనను వివరించారు. తాగినందుకు ఎన్టీఆర్ కుటుంబ బాధ్యతలను గుర్తు చేస్తూ జాగ్రత్త పడమని సలహా ఇచ్చారు. అలాగే, కృష్ణంరాజు తన భార్య మరణ వార్త తెలిసినప్పుడు చూపించిన నిగ్రహం, షూటింగ్‌ను కొనసాగించిన తీరును గుర్తు చేసుకున్నారు.

తాగేసి షూటింగ్‌కి వచ్చానని.. ఎన్టీఆర్ మా ఫైటర్స్‌ను పిలిచి ఏం చేశాడంటే..
Fighter Ramakrishna

Updated on: Jan 27, 2026 | 5:00 PM

ప్రముఖ ఫైటర్ రామకృష్ణ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీకు సంబంధించిన ఆసక్తికర సంఘటనలను వెల్లడించారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు లాంటి ప్రముఖ నటులతో తనకున్న వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఒకరోజు రాత్రి మూడు గంటల వరకు షూటింగ్ చేసి, మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి సెట్‌కు వచ్చానని రామకృష్ణ తెలిపారు. ముందు రోజు రాత్రి తాగిన వాసన వస్తుందని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారని చెప్పారు. ఎన్టీఆర్ నేరుగా రామకృష్ణతో మాట్లాడుతూ, “రేయ్, వాసన వస్తుందిరా తాగమాకండిరా. జాగ్రత్తగా ఉండండిరా” అని అన్నారని, ముఖ్యంగా “వెనకమాల నీ గురించి ఆలోచించడానికి వీళ్లందరూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు, పెళ్లాం నీ మీద ఆధారపడి ఉన్నారు” అని కుటుంబ బాధ్యతలను గుర్తు చేశారని రామకృష్ణ వివరించారు. ఈ సంఘటన తర్వాత తాను బయటికి వెళ్లి జామ ఆకులు నమిలి తిరిగి షాట్‌కు వెళ్లానని చెప్పారు. ఎన్టీఆర్ ఎప్పుడూ తనను “అన్నయ్య” లేదా “రామకృష్ణ” అని పేరు పెట్టి పిలుస్తారని, “ఒరేయ్” అని సంబోధించరని, ఈ గౌరవం తనకు ఎంతగానో నచ్చిందని రామకృష్ణ పేర్కొన్నారు.

ఇది చదవండి: అబ్బ.! ఆర్సీబీ జట్టు కొనేందుకు లైన్‌లోకి లక్కీ లేడీ.. ఎవరో తెలిస్తే స్టన్

కృష్ణంరాజుతో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన మరో సంఘటనను రామకృష్ణ పంచుకున్నారు. సెట్‌లో ఉన్న పది మందిలో తాను కూడా ఒకరిగా ఉన్నప్పుడు కృష్ణంరాజుకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, అందులో ఆయన భార్య చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు తెలిసిందని చెప్పారు. కృష్ణంరాజు మొదట “చిన్న యాక్సిడెంట్ అంట, హాస్పిటల్‌కు తీసుకెళ్లారంట” అని చెప్పి, షూటింగ్ ఆపేసి వెళ్లిపోయారని తెలిపారు. అయితే, కాసేపటి తర్వాత తిరిగి వచ్చి, ప్రొడ్యూసర్‌కు నష్టం రాకూడదనే ఉద్దేశంతో మరో గంట, రెండు గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారని రామకృష్ణ వెల్లడించారు. “రేపు షూటింగ్ పెట్టుకోకండి, నేను అక్కడే ఉంటాను” అని చెప్పి, రాత్రి ఫ్లైట్‌లో చెన్నైకి వెళ్లినట్లు తెలిపారు. ఆయన వెళ్ళాకే, తమకు మేనేజర్ ద్వారా కృష్ణంరాజు భార్య మరణ వార్త తెలిసిందని రామకృష్ణ వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ‘అలా అనుకుంటే ఎన్టీఆర్‌ను అడ్డంపెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని..’

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..