సత్తుపల్లిలో బ్రహ్మానందం పేరుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. స్పెషల్ ఏంటో తెలుసా

బ్రహ్మానందం అంటే తెలియని వాళ్లుండరు. జాతీయ స్థాయిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటుడు బ్రహ్మానందం. అలాంటి బ్రహ్మానందం పేరుతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది.

సత్తుపల్లిలో బ్రహ్మానందం పేరుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. స్పెషల్ ఏంటో తెలుసా
Brahmanandam
Follow us
N Narayana Rao

| Edited By: Rajeev Rayala

Updated on: Oct 19, 2024 | 10:30 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వందలాది సినిమాల్లో కమెడియన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా హీరో గా కూడా నటించి ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్న సినీ నటుడు బ్రహ్మానందం అంటే తెలియని వాళ్లుండరు. జాతీయ స్థాయిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటుడు బ్రహ్మానందం. అలాంటి బ్రహ్మానందం పేరుతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. అంతే కాదు ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నటుడు బ్రహ్మానందం కు అత్యంత ఇష్టమైన రుచికరమైన ఫాస్ట్ ఫుడ్ వంటకాలు ప్రత్యేకం.

ఇది కూడా చదవండి : అవును నిజం..! ఈవిడ.. ఆవిడే.. 10th క్లాస్ హీరోయిన్ను చూసి అవాక్ అవుతున్న నెటిజన్స్

అసలు కథ ఏమిటంటే… రాజు అనే యువకుడికి అందరిలా చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు అంటే ఇష్టం ఉండదు అంట. తనకు ఉత్తమ కామెడియన్ జాతీయ స్థాయి తెలుగు సినిమా నటుడు బ్రహ్మానందం అంటే చాలా అభిమానం అంట. ఆ అభిమానంతో తాను ఆగలేదు. తన అభిమానం గుండెల్లోనే దాచుకోలేదు. తన అభిమాన నటుడు బ్రహ్మానందం పేరుతో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా పెట్టాడు.

ఇది కూడా చదవండి : మాఫియా డాన్‌తో దోస్తానా.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.. చివరకు జైల్లో

వాస్తవానికి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు ఎవ్వరైనా వస్తే…అది బ్రహ్మానందం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనే అనుకుంటారు. అలా ఆ సెంటర్ మొత్తం బ్రహ్మానందం ఫోటోలతో నిండిపోతుంది. అక్కడికి వచ్చే వాళ్లు కూడా బ్రహ్మానందం అంటే అభిమానం ఉన్నవాళ్ళే వస్తుంటారు అంట. అదేవిధంగా బ్రహ్మానందం కు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ వంటకాలు ఇక్కడ స్పెషల్ గా చేసి కస్టమర్లకు కు సర్వీస్ చేస్తున్నాడు ఆ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడు రాజు. ఇలా సత్తుపల్లి పట్టణంలో బ్రహ్మానందం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మంచి ఫేమస్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Tollywood : హీరోయిన్‌గా సీనియర్ నటి కూతురు.. కానీ అంతకు ముందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.