AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే ఎంతో గౌరవం, అభిమానం.. ఏ అవసరమొచ్చినా వెంటనే హెల్ప్ చేస్తాడు

ప్రస్తుతం సిగ్మా సినిమా ప్రమోషన్లలో ఉన్న ఫరియా అబ్దుల్లా ఓ టాలీవుడ్ స్టార్ హీరోపై తన అభిమానాన్ని చాటుకుంది. ఆయనను ఓ మెంటార్ గా భావిస్తానని, కష్ట సమయంలో తనకు అండగా నిలుస్తుంటారని చిట్టి చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Faria Abdullah: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే ఎంతో గౌరవం, అభిమానం.. ఏ అవసరమొచ్చినా వెంటనే హెల్ప్ చేస్తాడు
Faria Abdullah
Basha Shek
|

Updated on: Sep 29, 2026 | 7:16 PM

Share

‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఫరియా అబ్దుల్లా. అందులో తన దైన అందం, అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుందీ అందాల తార. దీని తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా మెప్పించింది చిట్టి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగర్రాజు, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2, గుర్రం పాపి రెడ్డి, అనగనగా ఒక రాజు, గాయపడ్డ సింహం తదితర సినిమాల్లో నటించింది ఫరియా. ఇప్పుడు సిగ్మా అనే మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానుంది అందాల తార. తమిళనాడు సీఎం విజయ్ దళపతి కుమారుడు జేసన్ తెరకెక్కించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 02) న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోన్న ఫరియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘నాకు ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా అల్లు అర్జున్ తో పంచుకోవడానికి ఇష్టపడతాను. ఆయన ఎప్పుడూ నన్ను మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తుంటారు. బన్నీ అంటే నాకు ఎంతో గౌరవం, అభిమానం. అలాగనీ మేమిద్దరం రెగ్యులర్ గా ఫ్రెండ్స్ లా మెసేజులు చేసుకోం. కానీ నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అల్లు అర్జున్ వెంటనే స్పందిస్తారు. ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సమయంలోనూ ఆయన నాకు మద్దతుగా నిలిచారు. నాకు ధైర్యం చెప్పేలా పెద్ద మెసేజ్ పంపించారు. అంతేకాదు నేను ఏదైనా ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు నా డ్యాన్స్ లేదా పర్ఫామెన్స్‌ను చూసి అల్లు అర్జున్ వెంటనే స్పందిస్తారు. పాజిటివ్ గా కామెంట్స్ పెడతారు. ఆయన నుంచి నాకు ఎప్పుడూ మంచి ఎనర్జీ లభిస్తుంది. మేమిద్దరం కలిసి ఒక సినిమాలో కూడా నటించలేదు. కానీ మా మధ్య మంచి అనుబంధం ఉంది. నిజం చెప్పాలంటే.. ఆయన నాకు ఒక మెంటార్ లా ఉంటారు. ముఖ్యంగా నా డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసిన ప్రతి సారి అల్లు అర్జున్ ప్రశంసిస్తుంటారు. డైరెక్ట్ గా కలిసినప్పుడు కూడా నా పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుతుంటారు. బన్నీ ఇచ్చిన ప్రోత్సా హంతోనే నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. మేం రెగ్యులర్‌గా కలవకపోయినా, అవసరమైన సమయంలో నాకు అండగా నిలుస్తూ, ప్రోత్సహిస్తుంటారు’ అని ఫరియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Faria Abdullah, Allu Arjun

Faria Abdullah, Allu Arjun

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాకు ఏ అవసరమొచ్చినా వెంటనే ఆ స్టార్ హీరో వెంటనే హెల్ప్ చేస్తాడు
నాకు ఏ అవసరమొచ్చినా వెంటనే ఆ స్టార్ హీరో వెంటనే హెల్ప్ చేస్తాడు
రూ.25వేల జీతం వచ్చే ఉద్యోగికి 30 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు వస్తోంది
రూ.25వేల జీతం వచ్చే ఉద్యోగికి 30 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు వస్తోంది
ఇంట్లో చంటి పిల్లలున్నారా? పితృ పక్షాల్లో ఈ పనులు చేయకండి!
ఇంట్లో చంటి పిల్లలున్నారా? పితృ పక్షాల్లో ఈ పనులు చేయకండి!
గయలో పిండదానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. ముఖ్యమైన నియమాలు..
గయలో పిండదానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. ముఖ్యమైన నియమాలు..
అక్టోబర్ నెలలో వీరి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్!
అక్టోబర్ నెలలో వీరి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్!
శుభకార్యాల దగ్గర అరటి స్తంభాలు ఎందుకు పెడతారు?
శుభకార్యాల దగ్గర అరటి స్తంభాలు ఎందుకు పెడతారు?
సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు
సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు
నిమ్స్‌ అధికారిపై అక్రమాస్తుల ఆరోపణలు.. కట్‌చేస్తే..
నిమ్స్‌ అధికారిపై అక్రమాస్తుల ఆరోపణలు.. కట్‌చేస్తే..
మినప, పెసలు కంటే హై ప్రోటీన్ రిచ్ ఇడ్లీ.. ఉదయం ఒక్క ప్లేట్ తింటే
మినప, పెసలు కంటే హై ప్రోటీన్ రిచ్ ఇడ్లీ.. ఉదయం ఒక్క ప్లేట్ తింటే
ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో
ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో