
సినీ సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో, హీరోయిన్స్ బయట కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడిపోతారు. సినిమా ఫ్యాక్షన్స్ లేదా.. ఏదైనా షాపింగ్ మాల్ ఓపినింగ్స్ ఓపినింగ్స్ సమయంలో హీరో హీరోయిన్స్ చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తారు. దాంతో తమ అభిమాన నటీ నటులను చూడాలని , ఫోటోలు దిగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమంది అభిమానులు అత్యుత్సహం చూపిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఎన్టీఆర్ ను చూడటానికి ఆయనతో ఫోటో దిగడానికి అభిమానులు ఎగబడుతుంటారు. దేశం ఏదైనా సరే ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం తగ్గదు అనడానికి ఇప్పుడు మరో ఉదాహరణ దొరికింది.
ప్రస్తుతం లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ లైవ్ కాన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఈవెంట్ కు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి హాజరయ్యారు. కాగా ఎన్టీఆర్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ని చుట్టుముట్టిన అభిమానుల అతి ఉత్సాహం కారణంగా కొంత గందరగోళం ఏర్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్ అభిమానులను శాంతించమని, నియమాలు పాటించాలని కోరారు. అయినా కూడా అభిమానులు వినలేదు.. అందరికి ఫోటోలు ఇస్తాను, జాగ్రత్త అని చెప్పినా కూడా అభిమానులు వినిపించుకోకుండా గందరగోళం సృష్టించారు. ఎంత చెప్పినా ఫ్యాన్స్ వినిపించుకోకపోవడంతో ఎన్టీఆర్ కూడా సహనం కోల్పోయారు. అభిమానులు ఒక్కసారిగా ఎన్టీఆర్ చుట్టూ గుమిగూడడంతో, భద్రతా కారణాల దృష్ట్యా వారిని వెనక్కి నెట్టమని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. దాంతో చిన్న తోపులాట జరిగింది. కాగా సెక్యూరిటీ సిబ్బంది ఎన్టీఆర్ ను అక్కడి నుంచి పంపించేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
#JrNTR gets upset with fans during the RRR Live Concert at Royal Albert Hall.#RRR #RamCharan pic.twitter.com/I2YkF6O5lO
— Whynot Cinemas (@whynotcinemass_) May 11, 2025
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.