AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 3 Movie OTT: ఓటీటీలోకి నాని హిట్-3! బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అప్పుడేనా?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం హిట్-3: ది థర్డ్ కేస్. మే 01న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికీ ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది.

HIT 3 Movie OTT: ఓటీటీలోకి నాని హిట్-3! బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అప్పుడేనా?
Hit 3 Movie
Basha Shek
|

Updated on: May 13, 2025 | 2:14 PM

Share

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హిట్-3: ది థర్డ్‌ కేస్‌. గతంలో వచ్చిన హిట్ సిరీసుల్లో ఇది మూడో భాగం. మొదటి రెండు పార్ట్ లను తెరకెక్కించిన శైలేష్ కొలను హిట్-3ని తెరకెక్కించాడు. వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని, నానిలు హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందే టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే మే 01న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన హిట్-3 సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. సినిమాలో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా నాని ఉండడంతో ఆడియెన్స్ కు హిట్-3 సినిమా బాగా ఎక్కేసింది. ఇప్పటికే ఈ మూవీకి 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అలాగే రిలీజై రెండు వారాలైనా ఇప్పటికీ చాలా చోట్ల హిట్-3 సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో చిత్ర బృందం ఇటీవలే సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఇక హిట్-3 సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలా మంది మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే హిట్-3 సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు చక్కర్లుకొడుతున్నాయి.

నాని హిట్-3 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇందుకోసం రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు సమాచారం. థియేటర్‌లో రిలీజైన ఐదు వారాల తర్వాత హిట్-3 సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలన్న డీల్ కూడా కుదిరినట్లు సమాచారం. అంటే జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో హిట్ 3 ఓటీటీలోకి వచ్చే అవకాశ ముంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో హిట్- 3

హిట్-3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్ర ఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కొందరు స్టార్ హీరోలు క్యామియో రోల్స్ లో కనిపించారు. ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్ స్వరాలు సమకూర్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే