Samantha Ruth Prabhu: ప్లీజ్ చైతూ సమంతను దగ్గరకు తీసుకో.. ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్

మయోసైటిస్ డిసీజ్‌తో బాధపడుతున్నా.. తాజాగా యశోద ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సమంత. పాల్గొనడమే కాదు.. యశోద సినిమాతో పాటు.. తన పర్సనల్‌ విషయాలపై కూడా మాట్లాడారు

Samantha Ruth Prabhu: ప్లీజ్  చైతూ సమంతను దగ్గరకు తీసుకో.. ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్
Samanta Chaithanya

Updated on: Nov 08, 2022 | 6:24 PM

తన ఆరోగ్య పరిస్థితి బాలేకపోయినా… సినిమా కమిట్మెంట్‌లో మాత్రం ఖచ్చితంగా ఉంటారనే కామెంట్ సమంత పై ఉంది. ఇక ఆ కామెంట్‌నే నిజం చేస్తూ.. మయోసైటిస్ డిసీజ్‌తో బాధపడుతున్నా.. తాజాగా యశోద ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సమంత. పాల్గొనడమే కాదు.. యశోద సినిమాతో పాటు.. తన పర్సనల్‌ విషయాలపై కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. సామ్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు ఇంకొక్క అడుగు ముందుకు వేయలేను అని అనిపిస్తుంది.. కొన్నిసార్లు ఇంతదూరం వచ్చాను అనిపిస్తుంది.. నేను ఫైట్ చేయాలి అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది సమంత..

అయితే సమంత.. తన పరిస్థితిపై ఎమోషనల్ గా మాట్లాడడాన్ని… ఎమోషనల్ గానే చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. సమంత పడుతున్న వేధనను.. విడాకుల తరువాత ఆమె జీవితంలో జరిగిన మార్పులను కామెంట్స్‌లో కోట్ చేస్తున్నారు. సామ్ ఎమోషనల్ వీడియోలపై సామ్ అభిమానులు రకరకాలు గా స్పందిస్తున్నారు. మీరు చాలా ధైర్యవంతురాలు, మీకు ఏం కాదు అంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే మరికొంతమంది సామ్ మాజీ భర్త చైతన్య కూడా స్పందిస్తే బాగుంటుంది అని కామెంట్ చేస్తున్నారు.

సమంత పరిస్థితికి తనే కారణం అనేలా నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. చైతూ,సమంతను దగ్గర తీసుకోవాలని.. తనలో ఆత్మవిశ్వాసం కలిగేలా చేయాలని ఎమోషనల్ రిక్వెస్ట్ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్. ఏదిఏమైనా సమంత ఎదుర్కొన్న సమస్య.. దాని పై ఆమె చేసిన పోరాటం నిజంగా చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుందని అంటున్నారు సామ్ ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి