
ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ జీవినం సాగిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన చాలా మంది నటీనటులు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్నారు. అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయారు. కొంతమంది దీన స్థితిలో కనిపించారు. ఎంతో మంది తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కొందరు నటీ నటులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు దీన స్థితిలో ఉన్నారు. తాజగా ఓ నటుడు రోడ్డు పై అడుక్కుంటుకనిపించాడు. పై ఫొటోలో కనిపిస్తున్నది ఎవరో కాదు పిల్లల కామెడీషో నికెలోడియన్ ఫేం టైలర్ చేజ్.
నికెలోడియన్ అనే పిల్లల కామెడీ షోతో పాపులర్ అయ్యాడు టైలర్ చేజ్. ఈ షోలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించాడు టైలర్ చేజ్. ఈ షో తర్వాత ఆయన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతని డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఆతర్వాత ఉన్నట్టుండి ఆయన కనిపించకుండా మాయం అయ్యాడు. చాలా కాలం తరువాత ఇలా పిచోడిలా మారి కనిపించాడు. కాలిఫోర్నియా వీధుల్లో అతను పిచ్చోడిలా తిరుగుతూ కనిపించడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు అలరించిన తమ అభిమాన నటుడు ఇలా మారిపోవడంతో పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన పేరు మీద కొందరు ఫండ్ కూడా రైజ్ చేశారు. మొత్తంగా 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. కానీ ఆ డబ్బు తీసుకోవడానికి అతని తల్లి నిరాకరించారు. తన కొడుకుకు డబ్బు ముఖ్యం కాదు వైద్యం చేయించాలని ఆమె కోరారు. మతిస్థిమితం కోల్పోయిన తన కొడుకు ఎన్నిసార్లు ఫోన్స్ కొనిచ్చిన అవి పోగొట్టాడని ఆమె 5తెలిపారు. తన కొడుక్కి వైద్యం చేయించాలని ఆమె కోరుతున్నారు.
🇺🇸 FROM CHILD STAR TO HOMELESS IN CALIFORNIA – THE TYLER CHASE STORY
Tyler Chase, who played Martin on Nickelodeon’s Ned’s Declassified School Survival Guide, was recently spotted homeless in California.
In a viral street clip, he calmly explains he was on Nickelodeon and even… pic.twitter.com/ArPzugXqA0
— Mario Nawfal (@MarioNawfal) December 21, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.