Youtube Hit Song: యూట్యూబ్‌లో రికార్డ్స్ షేక్ చేస్తున్న ఎంజాయ్ ఎంజామి.. ఇంతకీ ఈ సాంగ్‌లో అంతగా ఏముంది?
Enjoy Enjaami Song: ఎంజాయ్ ఎంజామీ... ఆ మధ్య యూట్యూబ్ రికార్డ్స్‌ను.. సోషల్ మీడియా ట్రెండ్స్‌ను షేక్ చేసిన పాట. తాజాగా ఈ క్రేజీ సాంగ్ ఖాతాలో మరో రికార్డ్ కూడా యాడ్ అయ్యింది.
Enjoy Enjaami Song: ఎంజాయ్ ఎంజామీ… ఆ మధ్య యూట్యూబ్ రికార్డ్స్‌ను.. సోషల్ మీడియా ట్రెండ్స్‌ను షేక్ చేసిన పాట. తాజాగా ఈ క్రేజీ సాంగ్ ఖాతాలో మరో రికార్డ్ కూడా యాడ్ అయ్యింది. అదే హయ్యస్ట్ నంబర్ ఆఫ్ కవర్ సాంగ్స్. ఇండియాలో అత్యధిక కవర్స్ సాంగ్స్ చేసిన ఒరిజినల్‌గా ఎంజాయ్ ఎంజామి మరో రికార్డ్ సెట్ చేసింది. అసలు ఇంత క్రేజీ రావడానికి ఆ పాటలో అంతాగా ఏముంది.? ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా డిజైన్ చేసిన ఈ క్రేజీ సింగిల్‌లో ఓ తరం పడిన కష్టం గురించి చెప్పారు మేకర్స్. కాఫీ తోటల్లో పనిచేసే కార్మికుడి ఆకాంక్షలే ఈ పాటకు ప్రేరణ. అక్కడి వివక్ష, కష్టాలు, బాధలు అన్నింటిని ప్రస్థావిస్తూ అరివు ఈ సాంగ్ రాశారు. స్వయంగా కాఫీతోటల్లో పని చేసిన అనుభవంతో తన బామ్మ చెప్పిన అనుభవాల ఆధారంగానే ఈ పాట రాశారు అరివు.
తమిళనాడులో సెటిల్ అయిన శ్రీలంకన్‌ల యాక్సెంట్‌లో పాడిన ఈ పాటకు ధీ వాయిస్ మరింత ప్లస్ అయ్యింది. ఆమె కూడా శ్రీలంకన్ మూలాలున్న అమ్మాయే కావటంతో ఆ యాక్సెంట్‌ను పర్ఫెక్ట్‌గా పట్టుకోగలిగారు. ఊరికే పాడటమే కాదు.. సాంగ్‌లో అంతే ఈజ్‌తో యాక్ట్ చేసి మెప్పించారు ధీ.
ఎంజాయ్ ఎంజామీ సాంగ్.. వీడియో
ఈ సాంగ్‌కు వందల వర్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కార్టూన్ క్యారెక్టర్స్ నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు ఎంతో మంది ఈ సాంగ్ పాడుతున్నట్టుగా చేసిన ఎడిట్స్ వైరల్‌గా మారాయి. అంతేకాదు రీసెంట్‌గా యువన్ శంకర్ రాజా బర్త్ డే వేడుకల్లో కూడా సాంగ్ అండ్ సింగర్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
లెజెండరీ మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్ ఈ సాంగ్‌కు ప్రొడ్యూసర్. యంగ్ జనరేషన్‌ను ఎంకరేజ్ చేసేందుకు మాజ్జ అనే మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేసిన రెహమాన్… ఫస్ట్ అటెంప్ట్‌గా ఈ సాంగ్‌నే రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్‌తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి సత్తా చాటారు. మార్చి 7న రిలీజ్ అయిన ఈ సాంగ్ 324 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది.
– సతీష్, ET డెస్క్, టీవీ9 తెలుగు
Also Read..
Tamanna Beauty Tips: మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త అవతారం.. బ్యాక్ టు ది రూట్స్…
హిమాలయాల్లో త్రివర్ణ పతాకంతో జ్యోతిక.. లాక్డౌన్ డైరీలను పంచుకోవడం హ్యాపీ అంటూ ట్వీట్..