లైగర్ సినిమా పెట్టుబడులపై ఈడీ విచారణ కొనసాగుతోంది.ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మీ కౌర్, హీరో విజయదేవరకొండలను ప్రశ్నించిన ఈడీ.. సినిమాకు పెట్టుబడులకు, రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలను ఆరా తీసే పనిలో పడింది. ముఖ్యంగా పూరి కనెక్ట్స్‌కు ఎల్ఎల్‌పీకి 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు నగదు బదిలీపై ఈడి ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా 100 బినామీ అకౌంట్లో నుంచి ఈ నగదు బదిలీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించింది. లైగర్ సినిమాకు సుమారు పది కోట్ల రూపాయలు విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు గుర్తించింది ఈడీ. అదేవిధంగా విజయ్ దేవరకొండ గతంలో నటించిన సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే లైగర్ సినిమాకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వెనక మతలబు ఏంటో ఆరా తీసే పనిలో పడింది. అలాగే లైగర్ సినిమా పెట్టుబడులకు , రాజకీయ పార్టీ నేతలకు ఉన్న సంబంధాలను పరిశీలిస్తోంది.
కాగా ఈ విషయమై ఇప్పటికే పూరీ జగన్నాథ్ పాటు, నటి ఛార్మీలను ఈడీ అధికారులు విచారించారు. ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయిందన్న దానిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు12 గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. అలాగే విజయ్‌దేవరకొండపై కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. అసలే సినిమా ప్లాప్ అయ్యిందన్న నిరాశలో ఉన్న మేకర్స్‌కు ఈడీ విచారణ మరింత తలనొప్పిగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..