Megastar Chiranjeevi: చిరంజీవి.. పవన్ కళ్యాణ్‏తో ముచ్చటిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా ?.. అందరికీ సుపరిచితమైన రైటర్..

|

Mar 27, 2023 | 9:12 AM

చిరంజీవి... పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఒకప్పటి పిక్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో పవన్, చిరు లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫోటో చూస్తుంటే చిరు.. పవన్ ఏదో వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తోంది. నెట్టింటిని షేక్ చేస్తోన్న ఆ ఫోటోలో చిరు, పవన్ తో ఓ వ్యక్తి ముచ్చటిస్తూ కనిపిస్తున్నారు.

Megastar Chiranjeevi: చిరంజీవి.. పవన్ కళ్యాణ్‏తో ముచ్చటిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా ?.. అందరికీ సుపరిచితమైన రైటర్..
Chiranjeevi, Pawan Kalyan
Follow us on

మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. మెగా ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులు ఉన్నారు. మెగా కుటుంబానికి చెందిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి… పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఒకప్పటి పిక్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో పవన్, చిరు లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫోటో చూస్తుంటే చిరు.. పవన్ ఏదో వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తోంది. నెట్టింటిని షేక్ చేస్తోన్న ఆ ఫోటోలో చిరు, పవన్ తో ఓ వ్యక్తి ముచ్చటిస్తూ కనిపిస్తున్నారు. ఆయనతో చిరు మాట్లాడుతుండగా.. పవన్ చిరునవ్వుతో అతడిని చూస్తున్నారు. అయితే వారిద్దరి మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా. ఆయన ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ రైటర్. తను మరెవరో కాదు.. గొర్తి సత్యమూర్తి అలియాస్ జి. సత్యమూర్తి. మనందరికి సుపరిచితమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తండ్రే జి. సత్యమూర్తి.

తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న జన్మించారు జి.సత్యమూర్తి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రానికి రైటర్ గా పనిచేశారు సత్యమూర్తి. ఈ సినిమాతోనే ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బావా మరదళ్లు, కిరాయి కోటిగాడు, ఖైదీ నంబర్ 786, అభిలాష, పోలీస్ లాకప్, ఛాలెంజ్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన కథలు అందించారు. 1980,90 లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. అందులో బంగారు బుల్లోడు, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి, అమ్మ దొంగా, చంటి, శ్రీనివాస కళ్యాణం, పెద రాయుడు, మాతృదేవోభవ, రౌడీ అన్నయ్య చిత్రాలకు రైటర్ గా పనిచేశారు సత్యమూర్తి.

తెలుగులో దాదాపు 400కు పైగా సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ , జానీ చిత్రాలకు కూడా ఆయన రచయితగా పనిచేశారు. అయితే అనారోగ్య సమస్యలతో ఆయన 2015 డిసెంబర్ 14న చెన్నైలో కన్నుమూశారు. ఆయన తనయుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.