బిగ్ బాస్ శివాజితో ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు హాట్ బ్యూటీ దుమ్మురేపుతోంది.. ఎవరో తెలుసా..?

హౌస్ లోకి సామాన్యుడిగా వచ్చిన రైతు బిడ్డ ప్రశాంత్ కు, యావర్ కు సపోర్ట్ చేస్తూ వారిని ఫైనల్స్ వరకు తీసుకెళ్లారు. ఇక ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో తన బాధ్యత పూర్తయినట్టు భావించారు శివాజీ.. ప్రశాంత్ విన్నర్ అవ్వాలని గట్టిగానే కోరుకున్నారు శివాజీ. ఇక శివాజీ సినిమాల విషయానికొస్తే ఒకప్పుడు నేచురల్ స్టార్ అనే బిరుదు శివాజీకి ఉండేది. యువతను తన సినిమాలతో, కామెడీ టైమింగ్స్ తో ఆకట్టుకున్నాడు శివాజీ .

బిగ్ బాస్ శివాజితో ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు హాట్ బ్యూటీ దుమ్మురేపుతోంది.. ఎవరో తెలుసా..?
Shivaji

Updated on: Dec 19, 2023 | 6:48 PM

బిగ్ బాస్ సీజన్ 7 తో శివాజీ మరోసారి ప్రేక్షకుల నోర్లలో నానారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7తో ప్రేక్షకులను పలకరించారు. ఆ మధ్య రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించిన శివాజీ ఆతర్వాత సైలెంట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ ప్రేక్షకులను అలరించారు. హౌస్ కు పెద్దమనిషిగా అందరికి సలహాలు సూచనలు ఇస్తూ ఫైనలిస్ట్ అయ్యారు. హౌస్ లోకి సామాన్యుడిగా వచ్చిన రైతు బిడ్డ ప్రశాంత్ కు, యావర్ కు సపోర్ట్ చేస్తూ వారిని ఫైనల్స్ వరకు తీసుకెళ్లారు. ఇక ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో తన బాధ్యత పూర్తయినట్టు భావించారు శివాజీ.. ప్రశాంత్ విన్నర్ అవ్వాలని గట్టిగానే కోరుకున్నారు శివాజీ. ఇక శివాజీ సినిమాల విషయానికొస్తే ఒకప్పుడు నేచురల్ స్టార్ అనే బిరుదు శివాజీకి ఉండేది. యువతను తన సినిమాలతో, కామెడీ టైమింగ్స్ తో ఆకట్టుకున్నాడు శివాజీ .

అలాగే తాజ్ మహల్ అనే ప్రేమ కథ చిత్రాల్లో కూడా నటించాడు. పై ఫోటో ఆ సినిమాలోనిదే.. పై ఫొటోలో శివాజితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఆ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇప్పుడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆ అమ్మడు. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..  ఆమె పేరు నుష్రత్ భరూచ.

మొన్నామధ్య మన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో బ్యూటీనే హీరోయిన్. ప్రస్తుతం బాలీవుడ్ యమా క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ . 13 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాలో నటించింది. శివాజీతో తాజ్‌మహల్ అనే సినిమాలో నుష్రత్ హీరోయిన్‌గా చేసింది. కానీ అప్పట్లో టైటిల్ కార్డ్స్‌లో మాత్రం శ్రుతి అని పేరేశారు. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. నుష్రత్ భరూచా లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

నుష్రత్ భరూచా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

నుష్రత్ భరూచా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..