బిచ్చగాడిలా మారిన స్టార్ హీరో.. భయంతో బెంబేలెత్తిపోయిన జనం.. ఎవరో గుర్తుపట్టారా.?

సినిమాల కోసం ప్రాణం పెట్టి నటించే యాక్టర్లు చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు వీరు ఎలాంటి సాహసాలకైనా సై అంటారు. పాత్రల్లో సహజత్వం కనిపించడానికి జట్టు, గడ్డం భారీగా పెంచడం, బరువు పెరగడం.. ఇలా ఎన్నో రకాల త్యాగాలు చేస్తుంటారు కొందరు హీరోలు. తాజాగా ఓ హీరో బిచ్చగాడిలా మారాడు.

బిచ్చగాడిలా మారిన స్టార్ హీరో.. భయంతో బెంబేలెత్తిపోయిన జనం.. ఎవరో గుర్తుపట్టారా.?
Hero

Updated on: Jan 31, 2025 | 12:24 PM

అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు, మహారాజులు వ్యాపారులుగా, సామాన్యులుగా వేషాలు వేసుకుని సొంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు. ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీనటులు, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడూ గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతున్నారు. సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని  థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇలా గెటప్స్ మార్చుకోవడం వల్ల  ప్రజలను దగ్గరగా చూడటం. వారితో మాట్లాడే అవకాశం సెలబ్రెటీలకు లభిస్తుంది. ఇటీవల, ఒక సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషంధరించి తిరిగాడు.  దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే అతనెవరో గుర్తుపట్టారా.? తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయి.

రాతి యుగానికి చెందిన మనిషిలా పొడవాటి గడ్డం, పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి, కాళ్ళకు బూట్లు ధరించి ముంబైలోని రద్దీ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. బిచ్చగాడిలా హ్యాండ్‌కార్ట్‌ను లాగుతూ.. రోడ్‌సైడ్ షాపులకు వెళ్లి ఆహారం అడిగాడు. ఆ వ్యక్తి అవతారం చూసిన కొందరు పారిపోయారు.బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్ లో ఒకరు

అయన ఎవరో కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్. అమీర్  బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు. తొలుత ఈ వీడియో వైరల్‌గా మారడంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు. అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో, చిత్రాలు బయటకు వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగే అమీర్ ఖాన్ అని తెలిసింది. అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషధారణలో ముంబై వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు. అది సినిమా కోసమని కొందరు అంటున్నారు. మరికొందరు అది ఏదో ప్రకటన కోసం కావచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనువు అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకుని నగరాల వీధుల్లో తిరిగాడు. గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్లాడు.

అమీర్ ఖాన్ మేకప్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.