హీరోయిన్స్ గా రాణించాలి అంటే అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. సక్సెస్ లేకుండా ఎన్ని సినిమాలు చేస్తే మాత్రం ఏం లాభం చెప్పండి.. కొంతమంది హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్ అందుకోలేకపోతున్నారు. కొంతమంది అలా మెరిసి ఇలా మాయం అవుతున్నారు. వీరు ఇలా ఉంటే మరికొంతమంది భామల పరిస్థితి వేరే లా ఉంటుంది. హిట్ ఆదుకున్న తగినంత గుర్తింపు రాదు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. అందం అభినయం ఉన్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోతుంది. గ్లామర్ షోతో కవ్వించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ క్లాస్ హిట్ అందుకుంది. సీనియర్ హీరోల సరసన నటించి మాస్ హిట్ అందుకుంది. కానీ అనుకున్నత గుర్తింపు.. ఆశించిన అవకాశాలు రాబట్టుకోలేకపోతుంది. ఆమె యంగ్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్. మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆతర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది. కానీ సక్సెస్ అందుకోలేదు. ఇక సీనియర్ హీరోలతో జత కట్టింది. నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన అఖండ సినిమా చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఆ క్రెడిట్ బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరోసారి బాలయ్యకు జోడీగా డాకూ మహారాజ్ లో నటిస్తుంది. ఈ సినిమాతో నైనా ప్రగ్య జైస్వాల్ క్రేజ్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లకు చెమట్లు పట్టిస్తున్నాయి. అందాల ఆరబోతలో అదరహో అనిపిస్తుంది ఈ హాట్ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి