Tollywood : ఏంటి.! స్కూల్ డ్రస్ పాప.. బుల్లిగౌలో ఉన్న బ్యూటీ ఇద్దరూ ఒక్కటేనా..!!

|

Sep 29, 2024 | 8:30 PM

ఈ అమ్మడు కూడా ఆ లిస్ట్ లోకే వస్తుంది.  చిన్న చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టింది.. ఆతర్వాత యంగ్ హీరోలతో మీడియం రేంజ్ హీరోలతో జతకట్టింది. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మొదటి రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఆమె మూడో సినిమాకే బికినిలో కనిపించి షాక్ ఇచ్చింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు.

Tollywood : ఏంటి.! స్కూల్ డ్రస్ పాప.. బుల్లిగౌలో ఉన్న బ్యూటీ ఇద్దరూ ఒక్కటేనా..!!
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్స్ అందం అభినయం ఉన్న అదృష్టం లేక స్టార్ హీరోయిన్ రేస్ లో వెనకపడుతూ ఉంటారు. కొందరు తిరిగి బౌన్స్ బ్యాక్ అవడానికి కాస్త గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ అమ్మడు కూడా ఆ లిస్ట్ లోకే వస్తుంది.  చిన్న చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టింది.. ఆతర్వాత యంగ్ హీరోలతో మీడియం రేంజ్ హీరోలతో జతకట్టింది. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మొదటి రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఆమె మూడో సినిమాకే బికినిలో కనిపించి షాక్ ఇచ్చింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు. అంతలా బిజీగా అయ్యింది. ఆ తర్వాత ఊహించని ఎదురు దెబ్బ్బ తగిలింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంది. క్రేజీ ఆఫర్స్ వదులుకుంది. ఇప్పుడు ఎలా అయినా తిరిగి ట్రాక్ లోకి రావాలనుకుంటుంది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

పై ఫొటోలో రేంజ్ జడలతో స్కూల్ డ్రస్ లో క్యూట్ గా ఉన్న బ్యూటీ ఎవరో కాదు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ 2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. సమయంలో పూజాను చూసి దర్శకుడు మిష్కిన్ తన 2012లో వచ్చిన ‘ముఖమూడి’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అలా పూజా తొలిసారిగా సినీ రంగానికి పరిచయమైంది. అదే సినిమా తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా తమిళ సినిమా నుంచి తప్పుకుంది.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

2014 తెలుగు సినిమా ‘ఒక లైలా కోసం’లో అక్కినేనితో నాగ చైతన్య తో జతకట్టింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన ‘మొహెంజ దారో’ అనే హిందీ చిత్రంలో నటించింది. మిగతా భాషల్లో పెద్దగా నటించకపోయినా తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. ముకుంద సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో బికినీతో షాక్ ఇచ్చింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో చేసింది. కానీ ఆ మధ్య పూజా చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు సూర్య నటిస్తున్న సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ట్రై చేస్తోంది ఈ బుట్టబొమ్మ.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.