Tollywood : 100కు పైగా సినిమాలు.. అప్పట్లో గ్లామర్ క్వీన్.. ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లతోపాటు సైడ్ క్యారెక్టర్స్ సైతం పాపులర్ అయ్యాయి. తారలకు ధీటుగా అందం, అభినయంతో కట్టిపడేసిన సహయ నటీమణులు చాలా మంది ఉన్నారు. అందులో అపూర్వ కొల్లిపర ఒకరు. అప్పట్లో గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీని ఊపేసింది. విలన్ గా, సహయ నటిగా కనిపిస్తూనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న నటి గుర్తుందా.. ? ఒకప్పుడు తెలుగులో చక్రం తిప్పిన నటి. దాదాపు 100కు పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసింది. అటు పాజిటివ్.. ఇటు నెగిటివ్.. ఇలా రెండు రకాల పాత్రలలో కనిపించి ఆకట్టుకుంది. ఆమె పేరు అపూర్వ కొల్లిపర. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో జన్మించిన ఆమె.. మొదట హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2000 ఏడాదిలో అసలు ఏం జరిగింది అనే సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ విడుదల కాలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. కథానాయికగా కాకుండా సహయ నటిగా మారింది. అల్లరి సినిమాలో అల్లరి నరేష్ తల్లిగా కనిపించింది. మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అవకాశాలు క్యూ కట్టాయి.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
తెలుగులో ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, అదిరిందయ్యా చంద్రం, దేవి అభయం, వెంకీ, వీధి, ఉల్లాసంగా ఉత్సాహంగా, జానకి వెడ్స్ శ్రీరామ్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. రెడీ సినిమాలో బ్రహ్మానందం భార్యగా కనిపించింది. ఎవడిగోల వాడిదే, కెవ్వు కేక, సీమ టపాకాయ్, కుబేరులు వంటి సినిమాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న అపూర్వ.. ఇప్పుడు సినిమాలు తగ్గించేసింది.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
చాలా కాలంగా ఆమె సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అలాగే సోషల్ మీడియాలో మాత్రం అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. తాజాగా ఆమె లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అప్పట్లో సహయ నటిగా కనిపించిన అపూర్వ.. ఇప్పుడు ఫిట్‌నెస్ విషయంలో హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా స్లిమ్ గా కనిపిస్తుంది.

Apoorva Kollipara
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
