Tollywood: ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా ?..

|

Jan 25, 2023 | 7:10 PM

ఈ సినిమాలో వెంకీ, బ్రహ్మానందం, కోటా శ్రీనివాస్ రావు మధ్య వచ్చే కామెడీ సీన్స్ చిత్రానికే హైలెట్. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ వినీత కూడా కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రంలో వెంకీ తనయుడిగా కనిపించిన చిన్నోడి పేరు నాగ అన్వేష్.

Tollywood: ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా ?..
Actor
Follow us on

ఒకప్పుడు అగ్రకథానాయకుల సినిమాల్లో బాలనటీనటులుగా నటించిన చిన్నారులు ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయారు. తమ నటన.. అమాయకత్వంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమకు నచ్చిన రంగంలో కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన చైల్డ్ ఆర్టిస్టులలో వెంకటేష్ తనయుడు కూడా ఒకరు. అయితే రియల్ లైఫ్ కుమారుడు కాదండి.. రీల్ లైఫ్ తనయుడు. అతనెవరు.. ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా. విక్టరీ వెంకటేష్ కెరీర్‏లో సూపర్ హిట్ చిత్రాల్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఒకటి. సౌందర్య, వెంకటేష్ జంటగా నటించిన బెస్ట్ చిత్రాల్లో ఈ మూవీ ఒకటి. ఈ సినిమాలో వెంకీ, బ్రహ్మానందం, కోటా శ్రీనివాస్ రావు మధ్య వచ్చే కామెడీ సీన్స్ చిత్రానికే హైలెట్. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ వినీత కూడా కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రంలో వెంకీ తనయుడిగా కనిపించిన చిన్నోడి పేరు నాగ అన్వేష్.

ఇందులో వెంకటేష్… మనీషా కుమారుడు అయిన నాగ అన్వేష్… తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈచిత్రంలో అన్వేష్ నటన అద్భుతమనే చెప్పాలి. ఇందులో వెంకటేష్ ను ఓ ఆటాడుకున్నాడు. తన నటనతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రవేసుకున్నాడు. అయితే నాగ అన్వేష్ హీరోగానూ వెండితెరపై సందడి చేశాడు.

2015లో వచ్చిన వినవయ్య రామయ్య సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత 2017లో హెబ్బా పటేల్ తో ఏంజెల్ సినిమాలో నటించారు. ఈ మూవీతో నాగ అన్వెష్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నాగ అన్వేష్ నుంచి మరో మూవీ అనౌన్మెంట్ రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.