ఈమె ఆమేనా..! ఇదెక్కడి మేకోవర్ రా మావ..!! షాపింగ్ మాల్‌మూవీలో ఈ నటి గుర్తుందా.!!

ఇండస్ట్రీలోనిక్రేజీ హీరోయిన్లలో అంజలి ఒకరు. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సెకండ్ హీరోయిన్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది తన ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది.

ఈమె ఆమేనా..! ఇదెక్కడి మేకోవర్ రా మావ..!! షాపింగ్ మాల్‌మూవీలో ఈ నటి గుర్తుందా.!!
Tollywood Movie

Updated on: Feb 25, 2026 | 2:09 PM

తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ భామ. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి ఆకట్టుకుంది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అలాగే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది అంజలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక అంజలి షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  డైరెక్టర్ వసంత బాలన్ దర్శకత్వం వహించిన ‘అంగడి తేరు’ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంజలి. 2010లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని అప్పట్లో షాపింగ్ మాల్ పేరుతో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్, అంజలి, వెంకటేశ్, పాండి కీలకపాత్రలు పోషించారు.

ఈ చిత్రనికి విజయ్ ఆంటోని, జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. చెన్నైలోని టి-నగర్‌లోని బట్టల దుకాణాలలో పనిచేసే ఉద్యోగుల సమస్యల గురించి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మహేష్, అంజలి, పాండి పాత్రలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. వారిలో నటి సుకున నాగరాజన్ ఒకరు. సుకున నాగరాజన్.. షాపింగ్ మాల్ చిత్రంలో సోఫియా అనే పాత్రను పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాల్లో అంతగా కనిపించలేదు. సుకున షాపింగ్ మాల్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజన్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.

ఒక్క సినిమాతో ఫేమస్ అయిన సుకున ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఇక ప్రస్తుతం సుకున బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత భర్త కోరిక మేరకు సుకున సినిమాలకు దూరంగా ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుకున మాట్లాడుతూ.. ‘నాకు 8వ నెలలో అబార్షన్ జరిగింది. బిడ్డ కడుపులోనే చనిపోయింది. దాని నుండి కోలుకోవడంలో నా భర్త సహకరించాడు. తరువాత, నా కొడుకు జన్మించాడు. ‘ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన జీవితంలో ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. నల్లరంగులో ఉన్నందున తనను ఎంతో మంది అవమానించారని.. సినిమాల్లో రిజెక్ట్ చేశారని తెలిపింది. తనను ఎవరూ ప్రేమించలేరని.. తనతో ఎవరూ స్నేహం చేయరని తాను భావించానని.. కానీ ప్రేమ, పెళ్లి తర్వాత తన జీవితాన్ని భర్త పూర్తిగా మార్చేశాడని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us