Salaar : సలార్ ట్రైలర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులోనూ హీరోయిన్‌గా చేసింది

| Edited By: Ravi Kiran

Dec 08, 2023 | 2:30 PM

సలార్ విషయానికొస్తే కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ  నుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వరకు ప్రేక్షకులకు సినిమా పై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Salaar : సలార్ ట్రైలర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులోనూ హీరోయిన్‌గా చేసింది
Salaar
Follow us on

సలార్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు మోస్ట్ అవైటెడ్ మూవీగా యానిమల్ ఉండేది ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సూపర్ హిట్ టాక్ యానిమల్ సినిమా దూసుకుపోతోంది. ఇక సలార్ విషయానికొస్తే కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ  నుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వరకు ప్రేక్షకులకు సినిమా పై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సలార్ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో శృతి హాసన్ తో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించింది ఆమె ఎవరో తెలుసా..?

ట్రైలర్ లో ఈ హీరోయిన్ ను గుర్తుపట్టరా.? ఆమె ఎవరో తెలుసా..? ఆమె పేరు శ్రియా రెడ్డి. యాంకర్ గా వీడియో జాకీగా చేసి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది ఈ అమ్మడు. తమిళ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిన్నది సుపరిచితురాలే..తెలుగులో 2003లో వచ్చిన అప్పుడప్పుడు, 2006లో వచ్చిన అమ్మ చెప్పింది అనే సినిమాల్లో నటించింది.

ఆతర్వాత తమిళ్, మలయాళంలో సినిమాలు చేసి ఆకట్టుకుంది. రీసెంట్ గా సుడల్: ది వొర్టెక్స్ అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించింది. ఇక ఇప్పుడు సలార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనుంది. ఇక సలార్ సినిమాలో ఆమె పృథ్వీరాజ్ సుకుమారన్ భార్యగా కనిపిస్తుందని తెలుస్తోంది. సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, మలయాళ , కన్నడ, హిందీ భాషల్లో సలార్ సినిమా విడుదల కానుంది.

సలార్ ట్రైలర్

శ్రియ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.