హీరోయిన్స్ కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా.. ఇట్టే నెట్టింట వైరల్ అవుతుంటాయి. తమ అభిమాన హీరోయిన్స్ కు సంబంధించిన రకరకాల ఫోటోలు, న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక హీరోయిన్స్ త్రో బ్యాక్ ఫొటోస్ కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. అలాగే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో వైరల్ అవుతుంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. నటనలోనే కాదు నటంలోనూ తనకు తానే సాటి. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే సహజ నటన ఆమె సొంతం ఆమె ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..
పై ఫొటోలో క్లాసికల్ డాన్స్ చేస్తున్న చిన్నారి మరెవరో కాదు. సీనియర్ నటి రమ్యకృష్ణ. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలిన రమ్యకృష్ణ తమిళ్ లోనూ స్టార్ గా సత్తా చాటారు. దాదాపు అందరు సీనియర్ హీరోలతో కలిసి నటించారు రమ్యకృష్ణ.
ఇక ఇప్పుడు అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ మరోసారి పాపులర్ అయ్యారు. శివగామి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఫిదా చేశారు రమ్యకృష్ణ. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు రమ్యకృష్ణ. తాజగా ఆమె ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.