
ఒకప్పుడు ఎంతో మంది అభిమాన హీరో ఆయన.. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు. హీరోగా రాణించిన తర్వాత సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఆయన సినిమాల్లోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇంతకూ ఆయన ఎవరంటే..
80-90వ దశకంలో స్టార్ హీరోగా వేరిగారు భాను చందర్. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారీ ట్యాలెంటెడ్ యాక్టర్. 1978లో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు భాను చందర్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశారు. ఆ తర్వాత బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, వంశ గౌరవం, ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, రేచుక్క, పున్నమి రాత్రి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయాడు. ముఖ్యంగా భాను చందర్ యాక్షన్ సినిమాలకు అప్పట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.
ఇక భాను చందర్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏదంటే 1986లో వచ్చిన నిరీక్షణ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా వచ్చాయి. దీని తర్వాత కూడా హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు భాను చందర్. అయితే కాలక్రమేణా హీరోగా వరుసగా ప్లాఫులు ఎదురుకావడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారీ సీనియర్ యాక్టర్. తాజాగా ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 71ఏళ్ల భానుచందర్ వృద్దాప్య లుక్ లో కనిపించాడు. అందరూ షాక్ అవుతున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.