ఆమె నవ్వే ఓ నాటు గులాబీ.. కంగనా వెనకున్న అమ్మాయి ఎవరో కనిపెట్టరా.?

|

Nov 23, 2024 | 11:28 AM

బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కంగనా.. పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. తన సొంత ఇండస్ట్రీ పైనే ఆమె చాలా కామెంట్స్ చేసింది. అలాగే స్టార్ హీరోల పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. కంగనా గ్యాంగ్ స్టర్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఆమె నవ్వే ఓ నాటు గులాబీ.. కంగనా వెనకున్న అమ్మాయి ఎవరో కనిపెట్టరా.?
Kangana
Follow us on

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ కంగనా రనౌత్. హీరోయిన్ గానే కాదు కంగనా ఇప్పుడు ఏపీ కూడా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె గెలిచి ఎంపీ అయ్యింది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కంగనా.. పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. తన సొంత ఇండస్ట్రీ పైనే ఆమె చాలా కామెంట్స్ చేసింది. అలాగే స్టార్ హీరోల పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. కంగనా గ్యాంగ్ స్టర్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆతర్వాత ఆమె హిందీలో చాలా సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు చేసిన ఒకే ఒక్క సినిమా ఏక్ నిరంజన్. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ నటించింది.

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

ఇక కంగనా నటించిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంది. ఇంతకూ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమెకు తెలుగులోనే కాదు తమిళ్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? పై ఫొటోలో కంగనా వెనకాల అమాయకంగా కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో కాదు నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. ఆతర్వాత ఓ డాన్స్ షోలోనూ నటించింది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ధామ్ ధూమ్ అనే సినిమాలో సాయి పల్లవి చిన్న పాత్రలో నటించింది. జయం రవి ఈ సినిమాలో హీరో.. ఈ చిత్రంలో సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిది. ఇక ఇప్పుడు టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు మలయాళం, తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మాస్ రా మావ..! స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా మహేష్ అన్న కూతురు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..