
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీస్ లో బిజినస్ మాన్ సినిమా ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పోకిరి సినిమా తర్వాత పూరి, మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విరూపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించారు పూరిజగన్నాథ్. ఇక ఈ సినిమాలో డైలాగులు, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన క్యూటీ గుర్తుందా..?
తన బట్లర్ తెలుగుతో డైలాగులు చెప్తూ ఆకట్టుకుంది ఈ చిన్నది.. మీరు రిచ్ కిడ్ కాదా..? అంటూ ,ముద్దుముద్దుగా మాట్లాడిన ఆ భామ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆ అమ్మడి పేరు అయేషా శివ. ఈ చిన్నది పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. అదే సమయంలో పూరిజగన్నాథ్ బిజినెస్ మెన్ సినిమాకు ఆమెను ఎంపిక చేశారు.
ఆ సినిమాతర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు అయేషా శివ. తాజాగా ఈ కుర్రది ఎలా ఉందని ఇప్పుడు సోషల్ మీడియాలో గాలిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయేషా శివ ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి.