సోషల్ మీడియా ఇది మరో ప్రపంచం.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. నిత్యం రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు మరీనూ.. ఈ ముద్దుగుమ్మల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు ఎదో ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఓ బ్యూటీకి సంబంధించిన ఫోటో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ఉన్న భామను గుర్తుపట్టారా.. మాస్క్ పెట్టుకొని మిర్రర్ పిక్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది ఈ చిన్నది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..? కనిపెట్టలేక పోయారా..? అయితే మీకో క్లూ.. సీరియల్స్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న చిన్నది ఈమె.
ఇంతకు పై ఫొటోలో ఉన్న యాక్టర్ ఎవరో కనిపెట్టరా..? ఆమె మరెవరో కాదు సీరియల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమి విశ్వనాథ్. ఈ పేరు చెప్తే కొంతమంది గుర్తుపట్టక పోవచ్చు వంటలక్క అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు.
ప్రేమీ విశ్వనాథ్.. కార్తీక దీపం సీరియల్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఈ సీరియల్ లో డీ గ్లామర్ పాత్రలో కనిపించి మెప్పించింది వంటలక్క. చాలా మందికి ప్రేమీ విశ్వనాథ్ పేవరెట్. ఇక ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సీరియల్స్ షూటింగ్స్ అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఆమె సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.