
హీరో శ్రీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో చాలా బాగుంది ఒకటి. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించారు. 2000లో విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు స్నేహితుల మధ్య అనుబంధానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ హీరోయిన్ మాళవిక. ఇందులో భర్త స్నేహితుడి చేతిలోనే దాడికి గురికావడం..ఆపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇద్దరు స్నేహితులను దూరం చేసే గృహిణి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మాళవికకు వరుస ఆఫర్స్ వచ్చాయి. దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియనేస్తమా, అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ ఆఫర్స్ అందుకుంది. 2009 నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. తెలుగులో చివరిసారిగా అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో నటించింది.
అనుహ్యంగా సినిమాలకు దూరమైన మాళవిక 2007లో సురేశ్ మీనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి బాబు జన్మించాడు. ప్రస్తుతం మాళవిక తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తుంది. ఆమె భర్త ముంబైలో ఆర్కిటెక్టర్ ఇంటీరియర్ డిజైనర్ కావడంతో ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మాళవిక. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా మాళవిక షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
అప్పటికీ, ఇప్పటికీ మాళవిక గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మాళవిక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. బుల్లతెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. కానీ ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా చేయలేదు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.