RamiReddy: అమ్మోరు సినిమాలో విలన్ గుర్తున్నాడా..? నటనతో ఆల్లాడించేశాడు.. చికిత్సకు డబ్బుల్లేక చివరకు..

టాలీవుడ్ నటుడు రామిరెడ్డి గుర్తున్నారా.. ? తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో విలన్ పాత్రలతో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా సౌందర్య నటించిన అమ్మోరు సినిమాలో ఆయన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అనేక చిత్రాల్లో నటించిన ఆయన.. ఎన్నో హిట్ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు.

RamiReddy: అమ్మోరు సినిమాలో విలన్ గుర్తున్నాడా..? నటనతో ఆల్లాడించేశాడు.. చికిత్సకు డబ్బుల్లేక చివరకు..
Ramireddy

Updated on: Jul 18, 2025 | 4:34 PM

తెలుగు సినిమా పరిశ్రమలో విలన్ అంటే ఠక్కున గుర్తొచ్చే నటులలో రామిరెడ్డి ఒకరు. ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ 90వ దశకంలోని సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఒకప్పుడు ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు జనాలు భయంతో వణికిపోయేవాళ్లు. తెలుగులో అనేక చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలతో అద్భుతమైన నటనతో అలరించారు. ముఖ్యంగా సౌందర్య నటించిన అమ్మోరు సినిమాలో విలన్ పాత్రలో జనాలను భయపెట్టారు. ఇక అంకుశం సినిమా గురించి చెప్పుక్కర్లేదు. ఇందులో తన పాత్రలో ఒదిగిపోయారు. నటుడిగా మొదటి సినిమా అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆయనకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి విలన్ పాత్రలకు తన మార్క్ చూపించారు.

రామిరెడ్డి 1959లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం డిగ్రీ పూర్తి చేసి.. ఆ తర్వాత ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఆసక్తి ఉండడంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ప్రొఫెసర్ ఉద్యోగం వదిలేసి సినిమా కంపెనీలో చేరారు. 1990లో అంకుశం సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన.. ఈ సినిమాలో స్పాట్ పెడతా అనే డైలాగ్ తో మరింత ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత అమ్మోరు సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. అయితే నటుడిగా దూసుకుపోతున్న సమయంలోనే సొంతంగా నిర్మాణ సంస్థ స్తాపించి పలు సినిమాలు నిర్మించారు. అయితే ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.

ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

ఇవి కూడా చదవండి

అదే సమయంలో అనారోగ్య సమస్యలు ఆయనను మరింత ఇబ్బందికి గురిచేశాయి. కొన్నాళ్లపాటు కాలేయ సమస్యతో బాధపడ్డారు. దీంతో మంచి ఎత్తు, బలంగా కనిపించే రామిరెడ్డి .. ఆ వ్యాధి కారణంగా పూర్తిగా బక్కిచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అప్పుడే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో చికిత్సకు సైతం డబ్బులు లేకుండా పోయాయి. చివరకు 52 ఏళ్ల వయసులో 2011 ఏప్రిల్ 14న కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి : 

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..