
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది యాక్షన్ మూవీ ఛత్రపతి. డైరెక్టర్ రాజమౌళీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో యాక్షన్ హీరోగా ప్రభాస్ అదరగొట్టాడు. దీంతో ఈ మూవీతో మాస్ హీరోగా ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది. అలాగే అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో డార్లింగ్ సరసన శ్రియా శరణ్ కథానాయికగా నటించగా.. సీనియర్ హీరోయిన్ భానుప్రియ, అజయ్, షఫి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు.. ప్రభాస్ మాస్ నటవిశ్వరూపం సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ ఆల్ టైమ్ సూపర్ హిట్. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇందులో సూరీడు అనే చిన్న కుర్రాడి పాత్ర గురించి చెప్పక్కర్లేదు.
ఈ సినిమాలో కనిపించింది కొద్దిసేపు అయినా… ప్రభాస్ ను ఛత్రపతిగా మార్చేది ఆ కుర్రాడే కావడంతో ఈ చిత్రానికి అతడి పాత్రే కీలకంగా ఉంటుంది. రౌడీలు ఆ కుర్రాడిపై దాడి చేయడంతో అప్పటివరకు ప్రశాంతంగా కనిపించే ప్రభాస్ ఒక్కసారిగా ఉగ్రనరసింహావతారం ఎత్తి రౌడీలను అల్లాడిస్తాడు. ఈ ఒక్క సీన్ సినిమాకే హైలెట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. సూరీడు పాత్రలో నటించిన కుర్రాడి పేరు భశ్వంత్ వంశి. ఇందులో తనదైన నటనతో అప్పట్లోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అమాయకమైన చూపులు.. సహజ నటనతో మెప్పించాడు. ఛత్రపతి సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లిన అతడు మొదటి రౌండ్లోనే సెలక్ట్ అయ్యాడట. అతడి అమాయక చూపులకు జక్కన్న ఫిదా అయిపోయి సూరీడు పాత్రకు సెలక్ట్ చేసుకున్నారట.
ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు భశ్వంత్ వంశీ. తన తల్లితో కలిసి సూరీడు కనిపించిన సీన్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయాడానికి ఎక్కువగా ఉపయోగపడింది. ఈ సినిమా మరో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు హీరో కటౌట్ తో షాకిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ కుర్రాడి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సూరీడు పెద్దయ్యాక గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. గడ్డం, మీసాలతో ఊహించలేని విధంగా కనిపిస్తున్నాడు.
Bhaswanth Vamsi
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.