Devayani: పవన్ కల్యాణ్ ‘సుస్వాగతం’ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

|

Sep 02, 2024 | 5:14 PM

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ ఆరంభంలో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో సుస్వాగతం ఒకటి. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సుస్వాగతం సినిమా యూత్ ను బాగా మెప్పించింది. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడిపోయింది.

Devayani: పవన్ కల్యాణ్ సుస్వాగతం హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Actress Devayani
Follow us on

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ ఆరంభంలో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో సుస్వాగతం ఒకటి. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సుస్వాగతం సినిమా యూత్ ను బాగా మెప్పించింది. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడిపోయింది. ఇదే సుస్వాగతం సినిమాలో పవన్‌ కల్యాణ్ ప్రేమను తిరస్కరించే సంధ్య పాత్రలో దేవయాని నటన కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తర్వాత పవన్ ,దేవయానిలకు సినిమా అవకాశాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దేవయానికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సుస్వాగతం తర్వాత శ్రీకాంత్‌తో మాణిక్యం, జగపతిబాబుతో శ్రీమతి వెళ్లొస్తా, బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి తదితర హిట్‌ సినిమాల్లో నటించిందీ అందాల తార. కోలీవుడ్‌లోనూ అజిత్ కుమార్, శరత్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. సినిమాల్లో నటిస్తుండగానే తమిళ్‌ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్‌ రాజకుమారన్‌తో ప్రేమలో పడింది దేవయాని. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2001 ఏప్రిల్‌ 9న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు దేవయాని, రాజకుమార్. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇనియా, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలున్నారు.

ఇయ పెళ్లి తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ కూడా స్టార్ట్ చేసింది దేవయాని. అందులో భాగంగానే నాని సినిమాలో మహేశ్‌కు తల్లిగా కనిపించింది. అలాగే జనతా గ్యారేజ్‌, అరవింద సమేత, ఎన్టీఆర్‌ కథానాయకుడు, లవ్ స్టోరీ తదితర సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కాగా ఆ మధ్యన దేవయాని కుటుంబం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

దేవయాని లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

సినిమాల్లో దేవయాని బాగానే సంపాదించినప్పటికీ సినిమా నిర్మాణ రంగంలో పెట్టు బడులు పెట్టి పూర్తిగా నష్టపోయారట.  దీంతో దేవయాని కుటుంబ పోషణ కోసం టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. తమిళనాడులోని అన్నాసాలైలో గల చర్చ్‌ పార్క్‌ కాన్వెంట్‌లో స్కూల్‌లో ఆమె ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. తనకు ఉపాధ్యాయరాలిగా పనిచేయాలని చిన్ననాటి నుంచి కోరికని, అందుకే టీచర్ కోర్సు చదివి ఉత్తీర్ణత పొందానంటోందీ అందాల తార. కాగా దేవయానికి ఇనియ, ప్రియాంక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శరత్ కుమార్ తో నటి దేవయాని..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.