Bangaram Movie: పవన్ కల్యాణ్ ‘బంగారం’ మూవీ విలన్ భూమారెడ్డి గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? 

|

Jul 31, 2024 | 4:45 PM

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రోల్ తో పాటు మరో రోల్ అందరికీ తెగ నచ్చేసింది. అదే విలన్ భూమారెడ్డి పాత్ర. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు అశుతోష్ రాణా కనిపించారు. అంతుకు ముందు హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అశుతోష్ కు ఇదే మొదటి తెలుగు చిత్రం.

Bangaram Movie: పవన్ కల్యాణ్ బంగారం మూవీ విలన్ భూమారెడ్డి గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? 
Bangaram Movie
Follow us on

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో బంగారం కూడా ఒకటి. ధరణి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ హిట్ కాకపోయినా పవన్ ఫ్యాన్స్ కు మాత్రం బాగా నచ్చుతుంది. 2006 లో రిలీజైన బంగారం సినిమాలో మీరా చోప్రా హీరోయిన్ గా నటించింది. అలాగే రీమాసేన్ ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రోల్ తో పాటు మరో రోల్ అందరికీ తెగ నచ్చేసింది. అదే విలన్ భూమారెడ్డి పాత్ర. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు అశుతోష్ రాణా కనిపించారు. అంతుకు ముందు హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అశుతోష్ కు ఇదే మొదటి తెలుగు చిత్రం. అయితే సినిమాలో ఆ వ్యత్యాసమేమీ కనిపించదు. బంగారం సినిమాలో అశుతోష్ ఎంట్రీ కూడా హీరో రేంజ్ లోనే ఉంటుంది. ఇక ‘దేవరకొండ భూమా రెడ్డి’ అంటూ సినిమాలో ఆయన చేసే హంగామా, సందడి మామాలుగా ఉండదు. హీరో, హీరోయిన్లను వేటాడుతూ వారిని నిత్యం ముప్పుతిప్పలు పెడుతూ క్రూరమైన విలన్ పాత్రలో అదర గొట్టారు అశుతోష్ రాణా. ఈ సినిమా తర్వాత రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీలోనూ అశుతోష్ ఒక కీలక పాత్రలో మెరిశాడు. ఐపీఎస్ యోగేంద్ర శర్మ అనే స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తూనే విలన్ గా అదర గొట్టాడు.

ఇవి కూడా చదవండి

బంగారం, వెంకీ తర్వాత ఒక్కమగాడు, విక్టరీ, బలుపు, తడాఖా, పటాస్, కొరియర్ బాయ్ కళ్యాణ్, కృష్ణాష్టమి, నేనే రాజు నేనే మంత్రి, జై సింహ, సాక్ష్యం, విశ్వమిత్ర, కల్కి (రాజశేఖర్ ) తదితర సినిమాల్లో నటించాడు అశుతోష్ రాణా . అయితే ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉంటున్న ఆయన ఈ ఏడాది హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీలోనూ ఒక కీలక పాత్రలో మెరిశాడు. అలాగే అశుతోష్ నటించిన వెబ్ సిరీస్ మర్డర్ ఇన్ మహీమ్ కు కూడా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. ఇక అశుతోష్ రాణా సతీమణి కూడా మన తెలుగు వారికి సుపరిచితమే. రేణుకా సహనే మనీ, మనీ మనీ సినిమాల్లో నటించింది. సల్మాన్, మాధురి దీక్షిత్ నటించిన హమ్ అప్కే హై కౌన్ (ప్రేమాలయం) చిత్రంలో హీరోకు వదినగా నటించింది అశుతోష్ రానా భార్యనే.

అశుతోష్ రాణా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.