AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అసలేం మారలేదు భయ్యా.. మొగలి రేకులు హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్ చూశారా.. ?

ఒకప్పుడు బుల్లితెరపై సంచనలం మొగలిరేకులు సీరియల్. ఫ్యామిలీ అడియన్స్ తోపాటు యూత్ సైతం ఈ సీరియల్ కు వీరాభిమానులు. ఇప్పటికీ ఈ సీరియల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సీరియల్. ఇందులో నటించిన నటీనటులకు సైతం స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది.

Tollywood : అసలేం మారలేదు భయ్యా.. మొగలి రేకులు హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్ చూశారా.. ?
Liktha
Rajitha Chanti
|

Updated on: May 11, 2025 | 12:48 PM

Share

ఒకప్పుడు బుల్లితెరపై విపరీతమైన ఫ్యా్న్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సీరియల్ మొగలిరేకులు. కేవలం ఆడవాళ్లు మాత్రమే కాదు.. మగవాళ్లు.. యూత్ సైతం ఇష్టపడిన ఏకైక సీరియల్ ఇదే. రోటిన్ అత్తా కోడళ్ల స్టోరీ కాకుండా యువతను ఆకట్టుకునేలా.. ప్రతిక్షణం ఊహించని మలుపులతో ఆద్యంతం ఆకట్టుకుంది ఈ సీరియల్. ఇప్పటికీ ఈ సీరియల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందమైన ప్రేమ కథతోపాటు.. యాక్షన్ సీన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో కొన్ని సంవత్సరాలపాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సిరీయల్ ఇష్టపడని వారుండరు. ఇందులోని ప్రతి పాత్ర.. యాక్టర్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అప్పట్లో ఇందులో నటించిన హీరోహీరోయిన్ పాత్రకు ఓ రేంజ్ క్రేజ్ ఉండేది.

ముఖ్యంగా ఇందులో నటించిన మున్నా అలియాస్ ఆర్కేనాయుడు, శాంతి, సెల్వ, దేవి, ఈశ్వర్ పాత్రలకు మంచి ఫాలోవర్స్ ఉండేవారు. ఈ పాత్రలు సహజ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో వచ్చే మున్నా, దేవి లవ్ స్టోరీ గురించి చెప్పక్కర్లేదు. మున్నా పాత్రలో నటించిన సాగర్ ప్రస్తుతం సీరియల్స్ కు దూరంగా ఉంటున్నారు. ఇక దేవి పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ మాత్రం సీరియల్ సగంలోనే వెళ్లిపోయింది.

ఆమె పేరు లిఖిత కామిని. అందం, అభినయంతో అప్పట్లో బుల్లితెర ప్రేక్షకలను కట్టిపడేసింది. సీరియల్లో నటిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నటనకు దూరమయ్యింది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ లిఖిత అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..