AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా ?.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్.. ఎంతగా మారిపోయిందో..

కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఒకప్పుడు అలరించి అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన తారలు ఇప్పుడు మళ్లీ అభిమానులకు దగ్గరవుతున్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. నిత్యం తమ ఫ్యామిలీ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆమె ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ ఫేమస్ హీరోయిన్..

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా ?.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్.. ఎంతగా మారిపోయిందో..
Samvrutha
Rajitha Chanti
|

Updated on: Apr 17, 2024 | 7:56 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ అదృష్టం కలిసిరాక ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. నటనపరంగా ప్రశంసలు అందుకున్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్నారు. కానీ తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో మెరిశారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఒకప్పుడు అలరించి అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన తారలు ఇప్పుడు మళ్లీ అభిమానులకు దగ్గరవుతున్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. నిత్యం తమ ఫ్యామిలీ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆమె ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ ఫేమస్ హీరోయిన్.. తనే సంవృత సునీల్.

ఈపేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ఎవడైతే నాకేంటీ మూవీ హీరోయిన్ అంటే గుర్తుపడతారు. తెలుగులో ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా ఇదే. కేరళలో పుట్టిపెరిగిన సంవృత.. 2004లో రాసికన్ సినిమాతో మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది. ఉయిర్ మూవీతో తమిళ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తెలుగులో రాజశేఖర్ జోడిగా ఎవడైతే నాకేంటి సినిమా చేసింది. కానీ తమిళం, తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. మలయాళంలోనే అత్యధిక చిత్రాల్లో నటించింది.

2012లో అమెరికాకు చెందిన అఖిల్ రాజ్‌తో సంవృత వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు ఉత్తర కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు అగస్త్య ఫిబ్రవరి 21, 2015న జన్మించగా, చిన్న కుమారుడు రుద్ర నాలగేళ్ల క్రితం ఫిబ్రవరిలో జన్మించాడు. ఇటీవల విషు సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసింది సంవృత. చాలా కాలం తర్వాత ఆమెను చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. ఇప్పటికీ ఎంతో అందంగా ఉందని.. రీఎంట్రీ ఇవ్వొచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..