Komali Sisters: కోమలి సిస్టర్స్ గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. ఫోటోస్ వైరల్..

చిన్న వయసులోనే తమ మాటల చాతుర్యం, డైలాగ్ పంచులతో జనాలను కడుపుబ్బా నవ్వించారు. తమ అసమాన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పట్లో కోమలి సిస్టర్స్ అంటే చాలా పాపులర్. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ కామెడీ పంచులతో.. మిమిక్రీతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో తమ కామెడీతో నవ్వులు పంచారు. కోమలి సిస్టర్స్..

Komali Sisters: కోమలి సిస్టర్స్ గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. ఫోటోస్ వైరల్..
Komali Sister

Updated on: Jun 04, 2024 | 1:57 PM

సాధారణంగా అమ్మాయిలు మిమిక్రీ చేయడం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ ఇద్దరు చిన్నారులు మాత్రం తమ అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్న వయసులోనే తమ మాటల చాతుర్యం, డైలాగ్ పంచులతో జనాలను కడుపుబ్బా నవ్వించారు. తమ అసమాన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పట్లో కోమలి సిస్టర్స్ అంటే చాలా పాపులర్. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ కామెడీ పంచులతో.. మిమిక్రీతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో తమ కామెడీతో నవ్వులు పంచారు. కోమలి సిస్టర్స్.. నిజానికి ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల పేర్లు వేరే. వీరి అసలు పేర్లు హీరోషిణీ కోమలి, దేవర్షిణీ కోమలి.

ఖమ్మంకు చెందిన కోమలి సిస్టర్స్ హైదరాబాద్ లో పెరిగారు. చిన్నవయసులోనే తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. టీవీ9లో వీరిద్దరి పేరుతో ప్రత్యేకంగా ఓ కామెడీ షో కూడా నడిచింది. వీరిద్దరికి అప్పట్లో చాలా మంది అభిమానులు ఉండేవారు. కొన్నాళ్లపాటు తమ మిమిక్రీతో అలరించిన కోమలి సిస్టర్స్ ఆ తర్వాత చదువుల పై ఫోకస్ పెట్టారు. వీరిద్దరిలో అక్క హీరోషిని కోమలి మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం పూర్తి చేసింది. అలాగే హీరోయిన్‍గానూ వెండితెరకు పరిచయమైంది. హీరోషిని కోమలి ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేసి నటనలో సత్యానంద్ దగ్గర మెలుకువలు నేర్చుకుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాలో మెరిసిన హీరోషిని కోమలి.. ఆ తర్వాత 2019లో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్రాన్ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఉమా మహేశ్వరి పాత్రలో కనిపించింది. ఇక మంచి పాత్రలు మరిన్ని ఆఫర్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చెల్లెలు దేవర్షిణీ కోమలి కూడా ఇప్పుడు ఉన్నత చదువులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.